కొత్త పెళ్లి కూతురిపై కన్న తండ్రి అఘాయిత్యం.. పుట్టింటికి రావాలంటూ..!

newly married

అది ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నంద్యాలలోని దేవనగర్ ప్రాంతం. ఆంజనేయుల అనే వ్యక్తికి మళ్లీశ్వరి అనే కూతురు ఉంది. ఇక ఇదే ప్రాంతంలోని హరిజనపేటకు చెందిన మంజు అనే వ్యక్తితో మళ్లీశ్వరికి పరిచయం ఏర్పడింది. ఒకరునొకరు పూర్తిగా అర్థం చేసుకున్నారు. అలా కొంత కాలం మాట్లాడుకుంటూ వారి పరిచయం చివరికి ప్రేమ వరకు వెళ్లింది. అలా వారి ప్రేమకు రోజులు, నెలలు దాటి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

ఇక ఈ క్రమంలోనే మళ్లీశ్వరికి తన తండ్రి ఆంజనేయులు పెళ్లి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇక విషయం తెలుసుకున్న మళ్లీశ్వరి, మంజు పారిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు. దీంతో కొన్నాళ్ల పాటు వీరిద్దరూ కుటుంబానికి దూరంగా కాపురాన్ని పెట్టుకున్నారు. చివరికి తన కూతురు పెళ్లి చేసుకున్న విషయం మళ్లీశ్వరి తండ్రి ఆంజనేయులుకి తెలిసింది. నన్ను కాదని కూతురు వేరొకడిని వివాహం చేసుకుందని ఆంజనేయులు కట్టలు తెంచుకున్న కోపంతో ఊగిపోతున్నాడు.

newly marriedదీంతో ఓ రోజు తన కూతురికి ఫోన్ చేసి మీరిద్దరూ ఇంటికి రావాలని, మీతో మాట్లాడలంటూ కబురు పంపాడు. దీంతో పరుగు పరుగున ఇద్దరు మళ్లీశ్వరి పుట్టింటిలో అడుగు పెట్టారు. ఇక ఇంటికొచ్చిన ఇద్దరిని చూసిన ఆంజనేయలు తన కూతురిపై కత్తితో దారుణంగా దాడి చేశాడు. ఇక ఈ దాడిలో మళ్లీశ్వరికి కడుపులో, తలకు కొన్ని కత్తిపోట్లు గాయాలయ్యాయి. వెంటనే భర్త మంజు స్థానిక ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఇక పోలీసులు రంగంలోకి దిగి ఆంజనేయులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. కన్న కూతురిపై తండ్రి చేసిన ఇలాంటి ఆఘాయిత్యంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.