భార్యా భర్తల మధ్య అనోన్యంగా నిలవాల్సిన కుటుంబాలు చిన్న చిన్న గొడవలకు జీవితాలను రోడ్డుపైకి ఈడ్చుకుంటున్నారు. క్షణికావేషంతో చేయకూడని పనులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మాములుగా భర్త చీర కొనియలేదనో, సినిమాకు తీసుకెళ్లలేదనో, అడిగింది తీసుకురాలేదనో వంటి కారణాలతో భార్యలు తమ భర్తపై అలిగి చిన్నపాటి కోపాన్ని వెల్లగక్కటం అనేది మనం చూస్తుంటాం.
కానీ ఓ భార్య చేసిన పనికి మాత్రం అందరూ షాక్ కు గురవుతున్నారు. ఓ ఇల్లాలు భర్త ఇల్లు శుభ్రం చేయమన్నాడన్న కోపంతో భార్య చేసిన పనికి పోలీసులే నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి దాపరించింది. తాజాగా గుజరాత్‌లో జరిగిన ఈ ఘటనకు అంతా ముక్కు వెలేసుకుంటున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎంబీయే చదవిని ఓ యువతికి ఓ యువకుడితో గతంలో వివాహం జరిగింది. దీంతో ప్రతీ రోజు భార్య చేసే గొడవలకు, అల్లరికి భర్తకు ఏం చేయాలో తెలియక తికమకలో ఉన్నాడు.
ఇక భర్త ఇల్లు శుభ్రం చేయమన్నాడన్న కోపంతో ఒక్కసారిగా భార్య శివంగిలా మారి భర్తపై శివాలెత్తింది. ఎంబీయే చదివిన నన్ను ఇల్లు శుభ్రం చేయమంటావా..? ఎంత ధైర్యం నీకంటూ కోపంతో ఊగిపోయింది. ఇక ఇంతటితో ఆగిందా అంటే అదీ లేదు. పరుగులు తీసి ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. నా భర్త నన్ను ఇల్లు శుభ్రం చేయమన్నాడని కోపంతో పోలీసుల ముందు వివరించింది. వెంటనే అతనిపై కేసు నమోదు చేయాలనటంతో పోలీసులు ఒక్కసారిగా ముక్కున వేలుసుకున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటనకు స్థానికంగా కొందరిని కొంత షాక్ గురిచేస్తోంది. ఇక ఈ మహిళ చేసిన ఫిర్యాదుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.