ఎత్తైన 15 భవనాల్ని ఒకేసారి కూల్చేసిన చైనా.. వీడియో వైరల్

ఇంటర్నేషనల్ డెస్క్- ప్రపంచంలో అత్యధిక జనాబా కలిగిన చైనా దేశం పాలనా అంశాల్లో చాలా కఠినంగా ఉంటుంది. మన దేశంలో మాదిర అక్కడ పైరులకు స్వేఛ్చ ఉండదు. ప్రధానంగా ప్రభుత్వాకిని వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారికి మూడినట్లే. చైనా సర్కారు అలాంటి వారిని ఎంతమాత్రం ఉపేక్షించదు. ప్రపంచ ఆన్ లైన్ వ్యాపార దిగ్గడం అలీబాబు విషయంలో చైనా సర్కార్ ఏంచేసిందో అందరికి తెలిసిందే.

చైనా ఏవిషయంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఎవ్వరు ఎదురు చెప్పడానికి వీల్లేదు. ఇదిగో మరోసారి చైనా సర్కార్ ఓ బహుల అంతస్తుల భవనాల కూల్చివేతలో తొందరపాటు నిర్ణయం తీసుకుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చైనాలోని అధికారిక జిన్హువా న్యూస్ కధనంప్రకారం యునాన్ ప్రావిన్స్‌లోని కాన్మింగ్‌లో 15 భారీ అపార్ట్ మెంట్స్ ను గత ఎనిమిది ఏళ్లుగా నిర్మిస్తూనే ఉన్నారు.

China Childing 1

ఐతే చైనా ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు అవసరం లేని భవనాల్ని కూల్చేస్తోంది. ఈ 15 భారీ బహుల అంతస్తుల అపార్ట్ మెంట్స్ కు అంతగా డిమాండ్ లేదని చైనా సర్కార్ నిర్ధారమకు వచ్చింది. అందుకే వీటిని నిర్మించి లాభం ఏముందని ప్రభుత్వం భావించింది. అలాంటి వాటిని మొత్తం 85 వేల బ్లాస్టింగ్ పాయింట్లతో, 4.6 టన్నుల పేలుడు పదార్థాలతో క్షణాల్లో కూల్చేసింది. కేవలం 45 సెకండ్లలో ఈ 15 భవనాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి.

మొత్తం 8 ఎమర్జెన్సీ రెస్క్యూ టీమ్‌లను, 2,000 మంది రెస్క్యూ సిబ్బందిని ముందుగానే భవనాల దగ్గర్లో ఉంచారు అధికారులు. ఈ టీమ్‌లలో ఫైర్ రెస్క్యూ టీమ్స్, ఎనర్జెన్సీ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్స్, ఫ్లడ్ మేనేజ్ మెంట్ టీమ్స్ ఉన్నాయి. ఐతే చైనా ప్రభుత్వం ఈ భవనాలను సరైన పద్దతిలో కూల్చలేదనీ, శాస్త్రీయంగా కూల్చివేసి ఉంటే భవనాలన్నీ నిఠారుగా కూలిపోయేవనీ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఈ భారీ అపార్ట్ మెంట్స్ ను లియాంగ్ స్టార్ సిటీ ఫేజ్ 2 ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం మన రూపాయల్లో 1 వెయ్యి 138 కోట్ల రూపాయలు. ఇప్పుడు దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు నేలపాలైనట్టేనని వేరే చెప్పక్కర్లేదు.