అర్ధరాత్రి బయటకు వచ్చిన యువతి, ఎదురుగా ముగ్గురు యువకులు-వీడియో

క్రైం డెస్క్- ఢిల్లీలో దారుణం జరిగింది. అర్ధరాత్రి ఓ యువతిని ఇద్దరు యువకులు అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని ఢిల్లీ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన ఢిల్లీలోని ద్వారకా జిల్లాలో చోటుచేసుకుంది. బిందాపూర్ ప్రాంతానికి చెందిన ఒక యువతిని కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ యవతి హత్య వెనుక ఆమె స్నేహితుని హస్తముందని పోలీసులు భావిస్తున్నారు.

గత కొంత కాలంగా అతను ఆమెను వస్‌సైడ్‌ లవ్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్యకు సంబందించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యింది. దీంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ముగ్గురు కుర్రాళ్లు కనిపిస్తున్నారు. ఒక యువకుడు కత్తితో ఆ యువతిపై హఠాత్తుగా దాడి చేయడంతో ఆమె కిందపడిపోయింది. ఆ తరువాత ఆ యువకుడు ఆమె జుట్టు పట్టుకుని దాడి చేశాడు.

Delhi 1 1

ఇద్దరు యువకులు ఆ యువతిపై దాడి చేస్తుండగా, ఆమె వారి నుంచి తప్పించునేందుకు ప్రయత్నంచింది. ఆ తరువాత కాసేపటికి ఆమె అక్కడే ప్రాణాలొదిలింది. దాడి జరిగిన తరువాత ఆమె స్వయంగా ఆసుపత్రికి వెళ్లే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ ఫలితం లేక కుప్పకూలిపోయి, ప్రాణాలు వదిలింది. ఆ యువతి మాజీ ప్రియుడు అంకిత్ ఆమెపై దాడి చేసి, అక్కడి నుంచి పరారయ్యాడని పోలీసులు తెలిపారు.

ఆ యువతి అర్థరాత్రి దాటాక తన స్నేహితురాలిని కలుసుకునేందుకు వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయటకు వచ్చిందని పోలీసులు చెప్పారు. అలా ఇంటు నుంచి వచ్చిన కాసేపటికే ఆమె హత్యకు గురయ్యింది. మృతురాలిని పోలీసులు డాలీ బబ్బర్‌ గా గుర్తించారు. ఈ ఘటనలో అంకిత్ గాబా, హిమాంశు, మనీష్‌ల హస్తమున్నట్లు తెలిపిన పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.