ఫిల్మ్ డెస్క్- బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్, లేటు వయసు హీరోయిన్ మలైకా అరోరా గురించి అందరికి తెలిసిందే. చాలా కాలంగా వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారు. అర్జున్ కపూర్ కు 36 ఏళ్లు కాగా, మలైకా అరోరా కు 48 ఏళ్లు. అంటే వీళ్లిద్దరి మధ్య 12 ఏళ్ల వ్యత్యాసం ఉంది. మలైకా అరోరా కంటే అర్జున్ కపూర్ 12 ఏళ్లు చిన్నవాడు. అయినా ప్రేమకు వయసుతో సంబంధం ఏమందని చెబుతూ వస్తోంది ఈ ప్రేమ జంట.
ఇక అర్జున్ కపూర్ తన సినిమాల కంటే తన కన్నా వయసులో పెద్దదైన మలైకతో ప్రేమ వ్యవహరంతోనే ఎక్కువ పాపులర్ అయ్యాడు. అంతే కాదు ఆంటీతో డేటింగ్ ఏంటని సోషల్ మీడియాలో చాలా రోజుల నుంచి ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు. ప్రేమతో వయసుకు సంబంధం లేదని, తమకు ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉందంటూ కౌంటర్ గా కొటెషన్స్ చెప్పుకుంటు వస్తున్నారు ఈ లవ్ బర్డ్స్.
ఇటువంటి సమయంలో అర్జున్ కపూర్, మలైకా అరోరాకు మధ్య మనస్పర్ధలు వచ్చాయని, వీరిద్దరూ విడిపోయారంటూ, తమ ప్రేమకు బ్రేకప్ చెప్పుకున్నారంటూ బాలీవుడ్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇంత కాలం ప్రేమ గురించి కవితలు, కొటెషన్స్ చెప్పుకొచ్చిన ఈ జంట కూడా అందరిలాగే విడిపోయిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఐతే ఈ ప్రచారాన్ని అర్జున్ కపూర్ కొట్టిపారేశారు. తమపై వచ్చిన రూమార్లకు చెక్ పెడుతూ అర్జున్ ఒక్క ఫొటోతో క్లారిటీ ఇచ్చాడు. తన ప్రియురాలు మలైకా అరోరాతో కలిసి దిగిన ఫోటోను తన ఇన్ స్టాగ్రమ్ లో షేర్ చేశారు అర్జున్ కపూర్. నీచమైన పుకార్లకు ఇక్కడ చోటు లేదు.. సురక్షితంగా, సంతోషంగా ఉండండి.. లవ్ యూ ఆల్.. అనే క్యాప్షన్ కూడా ఫోటోకు జత చేశాడు అర్జున్ కపూర్. అదన్న మాట సంగతి.