సినిమా పరిశ్రమకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం, సంతోషంలో ఇండస్ట్రీ

అమరావతి- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీమా పరిశ్రమకు శుభవార్త చెప్పింది. కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా అన్ని రంగాలు కుదేలైంన సంగతి తెలిసిందే. అందులో భాగంగా సినిమా ఇండస్ట్రీ సైతం బాగా చతికిలపడిపోయింది. కరోనా నేపధ్యంలో సినిమా ధియేటర్స్ లో యాభై శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే సినిమాలు నడుస్తూ వచ్చాయి. ఏపీలోను ఇదే పరిస్థితి కొనసాగుతూ వచ్చింది.

చాలా రోజుల నుంచి సినిమా పరిశ్రమ పెద్దలు వంద శాతం ఆక్యుపెన్సీ అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కోరుతూ వస్తున్నారు. ఇదిగో ఇప్పుడు జగన్ సర్కార్ సినిమా పరిశ్రమకు తీపి కబురు చెప్పింది. వంద శాతం ఆక్యుపెన్సీతో, రోజుకు నాలుగు ఆటలు వేసుకోవచ్చు అని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇంకేముంది తెలుగు సినీమా ఇండస్ట్రీలో అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. జగన్ సర్కార్ నిర్ణయంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆనందం వ్యక్తం చేశారు.

Jagan

వంద శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ప్రారంభించుకోవడానికి పర్మిషన్ ఇచ్చినందుకు ఏపీ ప్రభుత్వానికి థ్యాంక్స్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి మా హృదయ పూర్వక ధన్యవాదాలు.. మంత్రి పేర్ని నాని గారి సహాయానికి థ్యాంక్స్.. ఇది ఇండస్ట్రీకి ఊపిరినిచ్చే అంశం.. అని దిల్ రాజు అన్నారు.

మైత్రి మూవీస్, డీవీవీ ఎంటర్టైన్ మెంట్స్ సైతం జగన్ ప్రభుత్వ నిర్ణయంపై స్పందించాయి. థియేటర్లో వందశాతం ఆక్యుపెన్సీని ప్రకటించినందుకు ఏపీ ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రి పేర్ని నారి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.. ఇలాంటి సమయంలో ఇది ఎంతో సాయం చేసే ప్రకటన.. అని డీవీవీ ఎంటర్టైన్ మెంట్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

ఇక ..ప్రతీ రోజూ నాలుగు షోలు, వందశాతం ఆక్యుపెన్సీతో అనుమతించినందుకు ముఖ్యమంత్రి జగన్, మంత్రి పేర్ని నాని గార్లకు ధన్యవాదాలు.. మళ్లీ చిత్రపరిశ్రమకు పూర్వ వైభవం వచ్చేందుకు ఇది మంచి నిర్ణయం.. అని మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. దసరా పండగ సందర్బంగా జగన్ సర్కార్ నిజంగా శుభవార్ చెప్పిందని తెలుగు సినీ పరిశ్రమ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.