ఆంధ్రప్రదేశ్ లో పింఛన్ తొలగించడమే లక్ష్యం!.. .ప్రభుత్వం పై ఆరోపణలు!!

The aim is to eliminate pension in Andhra Pradesh - Suman TV

ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొంటుంది. రేషన్ కార్డు లో రెండు ఫించన్ లు ఉంటె ఒక  ఫించన్ తగ్గించడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఏపీలో 61.28 లక్షల మంది లబ్దిదారులు ఉన్నారు. పెన్షన్ల కోసం రూ. 1478.90 కోట్లను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. రాజకీయంగా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా ఆరోపణలు వస్తున్నా సరే ప్రభుత్వ తీరులో మార్పు రావడం లేదనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్రంలో పింఛన్ తొలగించడమే లక్ష్యంగా అధికారులు పని చేస్తున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి. సరిచేసేందుకు సమయం ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారట అధికారులు.  ఆంధ్రప్రదేశ్ లో ఫించను లబ్ధిదారుల ఎంపికపై అధికారులు ఫోకస్ చేశారు. చాలావరకు అనర్హులు ఫించన్లు తీసుకుంటున్నారని, అసలైన లబ్ధి దారులకు పించను రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి దీంతో అనర్హుల ఏరివేతపై ప్రభుత్వం ఫోకస్ చేసింది.

The aim is to eliminate pension in Andhra Pradesh - Suman TVజిల్లాల వారికి ఏరివేతకు సర్వే చేస్తున్నారు. ఇకపై ఫింఛన్ పొందాలి అంటే కొత్త నిబంధనలు పెట్టారు.  క్షేత్రస్థాయిలో వాలంటీర్లు, సచివాలయ సంక్షేమ కార్యదర్శులు ఆయా దరఖాస్తులను పరిశీలించి వాస్తవాలను ఉన్నతాధికారులకు తెలియజేయాలి. లబ్ధిదారుల వృత్తికి జియోట్యాగింగ్‌ చేసి వారి లాగిన్లు ద్వారా మళ్లీ శాఖాధికారుల పరిశీలనకు పంపించాలి.  అధికారులు అందుబాటులో లేకపోవడంతో పత్రాలు ఇవ్వలేకపోయారు కొందరు లబ్ధిదారులు. కొన్ని ప్రాంతాల్లో ఉదయం చెప్పి సాయంత్రంలోగా పత్రాలు ఇవ్వాలంటూ ఆదేశాలు ఇవ్వడం ఇబ్బందిగా మారింది. వరుస సెలవులతో రెండు రోజుల్లోనే ఈ వ్యవహారం ముగిసినట్టు ఆరోపణలు వినపడుతున్నాయి.

ప్రస్తుతం ఎలాంటి బోగస్‌ పత్రాలకు ఆస్కారం లేకుండా నిజమైన కులవృత్తుల వారికి, మెడికల్‌ పరంగా అసలైన బాధితులకే పింఛను ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.  ఉన్నా తగిన పత్రాలు సమర్పించలేకపోవడంతో అనర్హుల జాబితాలోకి వెళ్ళడంతో ఫించన్ తీసుకునే వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం