హైదరాబాద్ జూపార్కులో యువకుడి హల్చల్! సింహంతో ఆటలు..

Zoo Park

సింహాన్ని దూరం నుండి చూడాలంటేనే అందరికి భయం వేస్తుంది. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా సింహం ఎన్ క్లోజర్ లోకి దూకేందుకు ప్రయత్నం చేసి అందరిని షాక్ కి గురి చేశాడు. హైదరాబాద్ లోని జూపార్కు ఇందకు వేదిక అయ్యింది.

ఆ వివరాల్లోకి వెళ్తే.. సాయి కుమార్ అనే 31 సంవత్సరాల యువకుడు అందరిలానే జూపార్కులోకి ప్రవేశించాడు. కానీ.., సింహం ఎన్ క్లోజర్ దగ్గరికి వచ్చాక, అతడు వెనుక భాగం నుండి సింహం ఎన్ క్లోజర్ లోకి ఎంటర్ అయ్యాడు. జూపార్కు సిబ్బంది ముందుగా ఈ విషయాన్ని గుర్తించలేదు. కానీ.., అక్కడ ఉన్న పర్యాటకులు కేకలు వేయడంతో సిబ్బంది క్షణాల్లో సాయి కుమార్ ని అదుపులోకి తీసుకున్నారు. తరువాత అతనిని పోలీసులకి అప్పగించారు.

సాయి కుమార్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అన్న విషయంలో విచారణ జరగాల్సి ఉంది. అతను సింహాన్ని దగ్గర నుండి చూడాలన్న ఉత్సహంతోనే ఈ పని చేశాడా? లేక.., ఏదైనా కారణాలతో ఆత్మహత్య చేసుకోవడానికి ఇలాంటి సాహసం చేయబోయాడా అనే విషయాలు తెలియాల్సి ఉంది. మరి.. సింహాతోనే ఆటలు ఆడిన ఈ యువకుడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.