సుకుమార్ ని దారుణంగా అవమానించిన స్టార్ డైరెక్టర్

"/>

డైరెక్టర్ సుకుమార్.. ఇండస్ట్రీలో ఈయన గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర దర్శకులలో సుకుమార్ ఒకరు. సుకుమార్ తెరకెక్కించే సినిమాల గురించి, ఆయన పనితనం గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆయన తీసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, కలెక్షన్స్ పరంగా కూడా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.

ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన పుష్ప పార్ట్-1 కూడా అదే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాకుండా అల్లు అర్జున్, సుకుమార్ కెరీర్ లోనే ఎక్కువ కలెక్షన్లు సాధించిన మూవీగా రికార్డ్ సృష్టించింది. పుష్ప సినిమా సక్సెస్ తో పలు ఇంటర్వ్యూల్లో బిజీగా ఉన్నాడు డైరెక్టర్ సుకుమార్.Maniratnamప్రస్తుతం పుష్ప-2 పనుల్లో బిజీగా ఉన్న సుకుమార్, డైరెక్టర్ మణిరత్నం గురించి ఎవ్వరు ఊహించని కామెంట్స్ చేసారు. ”నాకు మణిరత్నం అంటే చాలా ఇష్టం, ఆయన తెరకెక్కించిన గీతాంజలి సినిమాను చూసే నేను దర్శకుడిగా మారాలి అనుకున్నా.ఈ క్రమంలోనే ఆర్య సినిమా తర్వాత ఒకసారి ముంబైలో మణిరత్నంగారు కనిపిస్తే ఆయనతో మాట్లాడేందుకుట్రై చేశా. అదే టైంలో నటి శోభన తో ఆయన సీరియస్ డిస్కషన్ లో ఉన్నారు. చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత సార్ అంటూ దగ్గరికి వెళ్లా. అంతే ఒక్కసారిగా ఆయన కోపంగా నా వైపు చూస్తూ వెళ్లు అంటూ చేతితో సైగ చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఆయనని మీట్ అవ్వలేదు. ఆయన చేసింది తప్పు అని నేను అనను ఎందుకంటే ఓ డైరెక్టర్ గా ఆయన పరిస్ధితి అర్ధం చేసుకున్నాను. కానీ ఎందుకో తెలియదు అది నన్ను చాలా బాధపెట్టింది” అని చెప్పుకొచ్చాడు సుకుమార్. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.