అత్త నుంచి డాన్స్ పాఠాలు నేర్చుకోవాలి: షారుఖ్ ఖాన్

Sharukhan Mother in Law Dance Video Viral - Suman TV

బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ కొన్ని దశాబ్దాల నుంచి హిందీ చిత్రపరిశ్రమను ఏలుతున్న హీరో. పాత్ర ఏదైనా అందులోకి సులువుగా పరకాయ ప్రవేశం చేయగల గొప్ప నటుడు. అలాంటి వ్యక్తి ‘మా అత్తగారి నుంచి డాన్స్ నేర్చుకుంటా’అని అనడం ఆశ్చర్యం కలిగించే అంశమే. అసలు విషయం ఏంటంటే షారుఖ్ ఖాన్ సతీమణి గౌరిఖాన్ వాళ్ల అమ్మగారి పుట్టిన రోజు సందర్భంగా ఓ వీడియోను ట్వీట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

Sharukhan Mother in Law Dance Video Viral - Suman TVఅందులో గౌరిఖాన్ వాళ్ల అమ్మగారు మరో వ్యక్తి డాన్స్ చేస్తున్నారు. ‘మీ స్టేప్పులను మ్యాచ్ చేసేవారు ఎవరూ లేరు’ అన్నారు. ఆ వీడియోను షారుఖ్ ఖాన్ రీట్వీట్ చేస్తూ అత్తగారి నుంచి డాన్స్ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటూ సరదాగా అన్నారు. కాగా కింగ్ ఖాన్ బిగ్ స్క్రీన్ పై కనిపించి చాలా కాలమైంది. షారుఖ్ కొత్త సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.