పైన ఫొటోలో ఫస్ట్ ప్రైజ్ గెలిచిన పాప స్టార్ హీరోయిన్. తెలుగులో కెరీర్ స్టార్ట్ చేసి, హిందీలో దున్నేస్తోంది. మరి ఆ బ్యూటీ ఎవరో కనిపెట్టారా?
సాధారణంగా హీరోయిన్ల పేరు చెప్పగానే అందరికీ వాళ్ల ఫిజిక్, గ్లామర్, యాక్టింగ్.. ఇలా చాలా గుర్తొస్తాయి. కానీ ఈ హీరోయిన్ గుర్తురాగానే ముందుగా కాంట్రవర్సీలు మైండ్ లోకి వచ్చేస్తాయి. తెలుగులో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది గానీ బాలీవుడ్ లో సెటిలైపోయింది. ఏకంగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. సొంతంగా సినిమాలు తీసే స్టేజీకి వెళ్లిపోయింది. ఆలోవర్ ఇండియా ఎప్పటికప్పుడు తన గురించి మాట్లాడుకునేలా చేస్తోంది. మరి ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. పైన ఫొటోలో ఫస్ట్ ప్రైజ్ కొట్టేసిన ఈ పాపది దిల్లీ. చదువు పూర్తయిన తర్వాత మోడలింగ్ లోకి అడుగుపెట్టింది. స్టార్టింగ్ లో కొన్ని యాడ్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ‘ఝుమ్మంది నాదం’ మూవీతో హీరోయిన్ గా మారిపోయింది. అవును మేం మాట్లాడుతున్నది, ఫైన ఫొటోలో ఉన్న అమ్మాయి తాప్సీనే. టాలీవుడ్ లో వరసగా మూడేళ్లపాటు సినిమాలు చేసింది, ఓ మాదిరి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్ కి మకాం మార్చేసింది. అప్పటినుంచి ఇప్పటివరకు హిందీలోనే సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంది.
గతేడాది తెలుగులో వచ్చిన ‘మిసన్ ఇంపాజిబుల్’ అనే చిన్న పిల్లల ఎంటర్ టైనర్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఆ తర్వాత తెలుగులో వేరే ఏ మూవీస్ ఒప్పుకోలేదు. ప్రస్తుతం హిందీలో ఓ మూడు, తమిళంలో ఓ రెండు సినిమాలు చేస్తోంది. యాక్టింగ్ కెరీర్ గురించి పక్కనబెడితే.. హిందీలోకి వెళ్లిపోయిన తర్వాత ఓ సందర్భంలో ‘ఝమ్మంది నాదం’ మూవీ గురించి మాట్లాడుతూ చులకన చేసేసింది. దీంతో తెలుగు ఆడియెన్స్ కి మండింది. ఓ సందర్భంలో అయితే లక్ష్మీదేవి అవమానించేలా తాప్సీ డ్రస్ వేసుకుందని కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. దీంతో ఈమెపై కంప్లైంట్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే వివాదాలు ఈమె లైఫ్ లో ఉన్నాయి. అందం, గ్లామర్ తోపాటు కాంట్రవర్సీలు కూడా ఉన్న ఈ బ్యూటీ చిన్నప్పటి పిక్ చూసి మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.