సాయి ధరమ్ తేజ్‌ బైక్ యాక్సిడెంట్: రాత్రి 7 గంటల 45 నిమిషాల నుండి ఇప్పటి వరకు ఏం జరిగింది?

Sai Dharam Tej Bike Accident - Suman TV

‘మెగా’ మేనల్లుడు.., హీరో.. సాయిధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ అవ్వడం, ఆ ప్రమాదంలో తేజ్ కి తీవ్ర గాయాలు కావడం అందరికీ తెలిసిన విషయమే. అయితే.. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాదం జరిగిన తరువాత ఏమైంది? సాయి తేజ్ కి ఎలాంటి గాయాలు అయ్యాయి? ఇప్పుడు అతను ఆరోగ్యం ఎలా ఉంది? ఇలాంటి విషయాలన్నీ తెలియక.. ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. అందుకే.. అసలు ఈ యాక్సిడెంట్ పై కంప్లీట్ రిపోర్ట్ ని ఒక్కసారి తెలుసుకుందాం.

 • సాయిధరమ్ తేజ్.. శుక్రవారం రాత్రి 7 గంటల 45 నిమిషాలకు జూబ్లిహిల్స్లోని రోడ్ నెంబర్ 45 నుంచి గచ్చిబౌలికి బయల్దేరాడు.
 • రాత్రి 7 గంటల 58 నిమిషాల సమయంలో కేబుల్ బ్రిడ్జి కి చేరుకున్నాడు.
 • ఇక రాత్రి 8 గంటలకు కోహినూర్ హోటల్ దాటి.., ఐకియా వైపుకు వెళ్ళాడు. సరిగ్గా.. ఇక్కడే 8 గంటల 5 సెకండ్ల సమయంలో బైక్ స్కిడ్ అయి కిందపడిపోయాడు. ప్రమాదం జరిగిన సమయంలో సాయిధరమ్ తేజ్హెల్మెట్ ధరించే ఉన్నాడు. కానీ.., జాకెట్ ధరించలేదు. దీంతో.. తేజ్ కుడికన్ను, ఛాతి, పొట్ట భాగంలో తీవ్రగాయాలు అయ్యాయి. కాలర్ బోన్ ఫ్యాక్చర్ అయ్యింది. అకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదంతో సాయిధరమ్ తేజ్ స్పృహ కోల్పోయాడు.
 • Sai Dharam Tej Bike Accident - Suman TVప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108కి కాల్ చేశారు.
 • ప్రమాదం జరిగిన 20 నిమిషాలకి.. అంటే 8 గంటల 26 నిమిషాల సమయంలో తేజ్ ని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు.
 • ఇక రాత్రి 8 గంటల 27 నిమిషాలకు మాదాపూర్ పోలీసులకు సమాచారం అందింది.
 • 8 గంటల 35 నిమిషాలకు మెడికవర్ హాస్పిటల్కి చేరుకున్నారు పోలీసులు.
 • 8 గంటల 45 నిమిషాలకు మెడికవర్ హాస్పిటల్లో సాయిధరమ్కు చికిత్స ప్రారంభించారు.
 • తేజ్ కి ప్రమాదం జరిగిన విషయాన్ని కాస్త ఆలస్యంగా తెలుసుకున్న కుటుంబ సభ్యులు రాత్రి 9 గంటల సమయంలో మెడికవర్ హాస్పిటల్కి చేరుకున్నారు.
 • మెడికవర్ హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం రాత్రి 10 గంటల 45 నిమిషాలకు సాయిధరమ్ తేజ్ ని అక్కడి నుంచి అపోలో హాస్పిటల్కి తరలించారు.
 • ఇక రాత్రి 12 గంటల 30 నిమిషాలకు సాయి తేజ్ కి సంబంధించిన మొదటి హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు అపోలో హాస్పిటల్ వైద్యులు. ఈ అప్డేట్ ఇచ్చే సమయానికి కూడా తేజ్ స్పృహలోకి రాలేదు.
 • తరువాత ఈ శనివారం ఉదయం 7 గంటల సమయంలో మరోసారి హెల్త్ బులిటెన్ విడుదల చేశారు అపోలో వైద్యులు. ఈ సమయానికి కూడా తేజ్కు వెంటిలేటర్ పైన చికిత్స కొనసాగుతూ ఉంది. వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతోన్నా.. తేజ్ ఆరోగ్యం పై ఎటువంటి ఆందోళన అవసరం లేదని, అతని అన్నీ అవయవాల పనితీరు బాగున్నట్టు అపోలో వైద్యులు స్పష్టం చేశారు. ఈ హెల్త్ బులిటిన్ తో ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నారు.
 • Sai Dharam Tej Bike Accident - Suman TVఇక తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిష్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉదయం 07:16 నిమిషాలకి అపోలో వైద్యులతో సాయిధరమ్ తేజ ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడారు. గణనాధుడి ఆశీస్సులతో సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
 • ఇక ఉదయం 7 గంటల 53 నిమిషాల సమయంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో సాయి ధరమ్ తేజ్ పై పోలీస్ కేసు నమోదైంది. ర్యాష్ డ్రైవింగ్ కారణం పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.
 • ఇక ఉదయం 9 గంటల 44 నిమిషాలకి. సాయి ధరమ్ తేజ్ కి సంబంధించిన మూడవ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఇప్పటికీ తేజ్ ని ఐసీయూలోనే ఉంచి, వెంటిలేటర్ పై చికిత్స కొనసాగిస్తున్నట్టు వైద్యులు తెలిపారు.
 • 9 గంటల 46 నిమిషాలకి రామ్ చరణ్, ఉపాసన అపోలో హాస్పిటల్ కి చేరుకున్నారు. వీరు వచ్చాక మరో అప్డేట్ వచ్చింది.
 • ఇక 10 గంటల 09 నిమిషాలకి.. తేజ్ను మరో 24గంటలపాటు ఐసీయూలోనే ఉంచనున్నట్టు వైద్యులు తెలియచేశారు.
 • తరువాత మరో 40 నిమిషాలకి అనగా.. 10 గంటల 49 నిమిషాల సమయంలో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో హాస్పిటల్స్ ఎండీ సంగీత రెడ్డి తెలిపారు.
 • ఇక 11 గంటల 44 నిమిషాల సమయంలో ఈ యాక్సిడెంట్ పై పోలీసులు ఓ అప్డేట్ ని విడుదల చేశారు. వీకెండ్ పార్టీకి వెళ్తున్న సమయంలో సాయి ధరమ్ తేజ్కు ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు.
 • Sai Dharam Tej Bike Accident - Suman TVమధ్యాహ్నం 1 గంట సమయంలో.. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో GHMC పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్ పై ఉన్న ఇసుకను తొలగించడంలో నిర్లక్ష్యం వహించినందుకు ఈ కేసు నమోదు చేశారు.
 • ఇది ఇప్పటి వరకు ఉన్న మొత్తం సమాచారం. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం విషయంలో భయపడాల్సిన పని అయితే ఏమి లేదు. వైద్యులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే.. మరో కొన్ని గంటల్లోనే తేజ్ అందరితో మాట్లాడతాడు అని తెలుస్తోంది. మరి.. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని.. మీ విషెస్ ని కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.