పార్వతి ఇంత త్వరగా ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు!

Reasons why singer parvathy eliminated

తెలుగు రాష్ట్రాల ప్రజలకు సింగర్‌ పార్వతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కల్మషంలేని మనసు, ఊరి కోసం- ఊరి జనంకోసం ఏదొకటి చేయాలనే తపన. తాను పడిన కష్టాలు తన గ్రామస్థులు పడకూడదని ఊరికి బస్సు తీసుకొచ్చిన ఆమె వ్యక్తిత్వం అందరినీ మంత్రి ముగ్దులను చేసింది. ఒక్క పాటతో ఆమె ఓవర్‌ నైట్ స్టార్ అయిపోయింది. కానీ సరిగమప షో నుంచి ఆదివారం ఎపిసోడ్‌ లో సింగర్ పార్వతి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిపోయింది. అయితే పార్వతి అంత త్వరగా షో నుంచి వెళ్లిపోవడం తెలుగు అభిమానులను ఆశ్చర్యానికే కాదు.. అయోమయానికి కూడా గురిచేసింది. అయితే టైటిల్ ఫేవరెట్‌ గా షోలో అడుగుపెట్టిన సింగర్ పార్వతి ఇంత త్వరగా ఎందుకు ఎలిమినేట్ అయ్యింది? అసలు అందుకుగల కారణాలు ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం.

ఇదీ చదవండి: ప్రభాస్ ఆదిపురుష్‌ సినిమాపై KTR సంచలన వ్యాఖ్యలు!

సింగర్ పార్వతి కర్నూలు జిల్లాకు చెందిన రైతు కుటుంబానికి చెందిన అమ్మాయి. ఎన్నో కలలు, మరెన్నో ఆశలతో ఎంతో కష్టపడి సరిగమప షోలో అడుగుపెట్టింది. మొదటి పాటతోనే ఆమెకు అనుకున్న దానికంటే ఎక్కువ గుర్తింపు లభించింది. తన ఊరికి బస్సు తీసుకురావడంతో ఆమె వ్యక్తిత్వానికి అభిమానులు పెరిగిపోయారు. కానీ, ఆ అభిమానమే ఆమె ఇంత త్వరగా ఎలిమినేట్ అవడానికి కారణం అంటూ కొందరు భావిస్తున్నారు. అలా అనుకోవడంలో తప్పు లేదనే చెప్పాలి. ఎందుకంటే పార్వతికి వచ్చిన్ స్టార్డమ్‌ అలాంటింది. పల్లెటూరు నుంచి ఇక్కడిదాకా వచ్చి.. ప్రజల్లో ఎంతో గుర్తింపు తెచ్చుకోవడంతో అందరూ ఇంటర్వ్యూలు చేయడం మొదలు పెట్టారు. ఆ ఇంటర్వ్యూలు కూడా ఏ స్థాయిలో జరిగాయంటే ఆమెకు కనీసం ప్రాక్టీస్‌ చేసుకునేందుకు కూడా సమయం లేనంతగా అనమాట. ఆ విషయం పార్వతీనే స్టేజ్‌ పై చెప్పడం చూశాం. ప్రాక్టీస్ చేయడానికి కూడా టైమ్ లేనంతగా బిజీ అయిపోయావా? అప్పుడే సెలబ్రిటీ అయిపోయావా అని కోటీ కన్నెర్ర చేసేంత పని చేసింది.

Singer parvathy eliminated from sarigamapa

మరోవైపు తన పాట, వ్యక్తిత్వం, అమాయకత్వానికి విపరీతమైన అభిమానులు పెరిగిపోవడం. అవును అభిమానులు కూడా ఆమె ఎలిమినేట్ అవ్వడానికి కారణంగా చెప్పవచ్చు. ఆమె పేరు, ఊరు, వారి కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకుని ఎంతో మంది అభిమానులయ్యారు. ఆమెకు సన్మానాలు చేయడం, ఫోన్లు చేసి విష్‌ చేయడం ఎక్కువైపోయింది. ఎంతగా అంటే ప్రాక్టీస్ చేయడం కన్నా కూడా ఫోన్లు మాట్లాడటానికే సమయం సరిపోయేంతగా. ఆమె టాలెంట్ ను గుర్తించి పిలిచి సన్మానాలు చేయడం కూడా పెరిగిపోయింది. ఈ కారణం వల్ల కూడా సింగర్ పార్వతి ఇంత త్వరగా సరిగమప షో నుంచి తప్పుకునే దాకా తెచ్చింది. మొదటిసారి డేంజర్ జోన్‌లోకి వచ్చిన పార్వతిని జడ్జెస్‌ హెచ్చరించి మరో అవకాశం ఇచ్చారు. కానీ, రెండోసారి కూడా అదే రిపీట్ అయ్యేసరికి వాళ్లు కూడా కాపాడలేకపోయారు.

ఇదీ చదవండి: సినిమాల్లోకి సచిన్ కూతురు సారా.. డెబ్యూపై క్లారిటీ!

ఇంకో ప్రధాన కారణం.. తన పాట, తన నడవడికలోని సహజత్వాన్ని కోల్పోవడం. ఇన్నాళ్లు పల్లెటూరిలో ఉన్న పార్వతి కొత్తగా సిటీ కల్చర్‌ కు అలవాటు పడేందుకు ప్రయత్నించడం, తన పాటలు కూడా అలాంటివే సెలక్ట్ చేసుకోవడం ఆమె కొంప ముంచిందనే చెప్పాలి. ఉదాహరణకు కర్నూలు జిల్లా నుంచి పార్వతి అన్నీ పదాలను స్పష్టంగా పలకలేకపోవచ్చు. మధుర మధుర తల మీనాక్షి పాట సమయంలో అది క్లియర్ గా కనిపించింది. జడ్జెస్ కూడా పాటలో కొన్ని పదాలు స్పష్టంగా పలకలేకపోయిందనే అభిప్రాయపడ్డారు. ఇలా అన్నీ గమనిస్తే ఓవర్‌ నైట్‌ స్టార్‌ గా మారడమే ముఖ్యంగా పార్వతి ఇంత త్వరగా ఎలిమినేట్ కావడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అయితే సింగర్‌ పార్వతి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మళ్లీ షోలో అడుగుపెట్టి టైటిల్‌ కొట్టాలని తన అభిమానులు కోరుకుంటున్నారు. సింగర్‌ పార్వతిని వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలో తీసుకురావాలని మీరూ భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.