బిగ్ బ్రేకింగ్! హీరో రామ్ ఇంట్లో విషాదం!

తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఒకవైపు కరోనా తీరని నష్టాలను తెచ్చి పెడుతోంది. మరోవైపు ఈ క్లిష్ట సమయంలో పరిశ్రమలో విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో రామ్ ఇంట ఇలాంటి సంఘటనే జరిగింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్ తాతయ్య ఈ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని హీరో రామ్ సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించారు. “తాతయ్య నువ్వెప్పటికీ మా గుండెల్లో బతికే ఉంటావు. మీరు విజయవాడలో లారీ డ్రైవర్గా జీవితం ప్రారంభించిన సమయంలో ఎన్ని కష్టాలు పడ్డారో ఉహించగలను. మీ కుటుంబ సభ్యులమైన మాకు అన్ని రకాల వసతులు కల్పించడానికి మీరు ఎన్నో బాధలు పడ్డారు, అవమానాలు భరించారు. డబ్బు ఉంటేనే ధనవుంతులు కారనీ, మంచి మనసు ఉన్న వారే నిజమైన శ్రీమంతులు అని మాకు నేర్పించారు. మీ పిల్లలను ఉన్నత స్థాయిలో ఉంచేందుకు మీరు కన్న కలలు నేడు నేరవేరాయి. కానీ .., ఈరోజు మీరు లేరన్న వార్త నన్ను ఎంతో బాధిస్తోంది. మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను” అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు రామ్.

ram 2

రామ్ పోస్ట్ చూసిన ప్రతి ఒక్కరూ.. ఆయనకి తాతపై ఎంత గౌరవం ఉందొ అర్ధం అవుతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రామ్ తాతగారు తన బిడ్డలని ఉన్నత స్థితిలో నిలపడానికి చాలానే కష్టపడ్డారు. లారీ డ్రైవర్ గా పని చేస్తూనే వారిని ఉన్నత చదువు చదివించాడు. రామ్ తండ్రి మురళీ మోహన్ పోతినేని సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్నారు. ఇలాగే రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ గురించి అందరికీ తెలిసిందే. ఈయనకి టాలీవుడ్ లో అభిరుచి గల నిర్మాతగా పేరుంది. రామ్ తాత గారు.. తన పెద్ద కొడుకుని ఆ రోజుల్లోనే సీఏ చదివించారు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత స్రవంతి రవి కిషోర్ సినిమాల వైపు అడుగులు వేశాడు. స్నేహితుల సలహా మేరకు సినీ నిర్మాణ రంగంలో ప్రవేశించాడు. అలా.. మిత్రులతో కలిసి మొదటి సారిగా లేడీస్ టైలర్ అనే చిత్రాన్ని నిర్మించాడు. అది సూపర్ హిట్. ఈ విధంగా టాలీవుడ్ లోకి హీరో రామ్ ఫ్యామిలీ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా నిర్మాణానికి కూడా రామ్ తాత గారు అందించిన ప్రోత్సాహమే కారణమట. అలా.., అట్టడుగు స్థాయి నుండి.. కష్టపడి కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చిన తాతయ్య మరణంతో రామ్, అతని కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ బాధ నుండి వారి ఫ్యామిలీ త్వరగా కోలుకోవాలని కామెంట్స్ రూపంలో కోరుకుందాం.