టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ హీరోల జాబితాలో.. రామ్ పోతినేని పేరు ముందు వరుసలో ఉంటుంది. కొన్నాళ్ల క్రితం వరకు కూడా రామ్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ జోరుగా వార్తలు వచ్చాయి. కానీ అవన్ని పుకార్లే అని తేలింది. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం సినిమాల మీదనే ఉందని స్పష్టం చేశాడు. ఇక రామ్ చివరగా వారియర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా అనుకున్నంత మేర విజయం సాధించలేదు. ఇక ప్రస్తుతం రామ్ బోయపాటి శ్రీను దర్శత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఆదివారం రామ్ చేసిన ఓ ట్విట్టర్ పోస్ట్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వివరాలు..
‘‘ఇది సన్ డే.. సిద్ధాంత్ పోతినేని’’ అంటూ.. ఓ చిన్న పిల్లాడితో ఉన్న ఫోటోని షేర్ చేశాడు రామ్. ఇది చూసిన వారంతా… రామ్‌కు ఇంత పెద్ద కొడుకున్నాడా.. అసలు పెళ్లి ఎప్పుడు అయ్యింది అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. సీక్రెట్‌గా వివాహం చేసుకున్నాడా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు రామ్‌తో ఉన్న ఈ పిల్లాడు ఎవరు అంటూ ఆరా తీయసాగారు. ఇంతకు మరి ఎవరు ఈ పిల్లాడు అంటే.. రామ్ కొడుకే.. అదేలా అంటే..
ఈ ఫోటోలో రామ్‌తో ఉన్న సిద్ధాంత్ ఎవరో కాదు.. అతడి సోదరుడి కొడుకు. అలా సిద్ధాంత్.. రామ్‌కు కొడుకు అవుతాడు. తనకు షూటింగ్స్ నుంచి గ్యాప్ దొరికిన ప్రతి సారి రామ్.. ఈ పిల్లాడితో ఆడుతూ.. ఎంజాయ్ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ఆదివారం నాడు.. సన్ డే అంటూ సిద్ధాంత్‌తో దిగిన ఫోటోని షేర్ చేశాడు. ప్రస్తుతం ఇది వైరలవుతోంది. క్యూట్ బాయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజనులు.
Coz it’s a SONday.. #Sidhanthpothineni pic.twitter.com/8hrXNNsjly
— RAm POthineni (@ramsayz) January 8, 2023