ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ప్రపంచంలో ఏ మూల ఏ చిన్న సంఘటన జరిగినా గానీ క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇక వీటితో పాటే సెలబ్రిటీలకు సంబంధించిన చిన్న నాటి, వింటేజ్ ఫోటోలు కొన్ని కొన్ని సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి ఫోటోనే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఓ సినిమా షూటింగ్ సందర్భంగా సెట్లో పిల్లలతో మాట్లాడుతున్న పిక్ అది. ఈ పిక్ లో వెంకటేష్ తో పాటుగా.. ఓ స్టార్ డైరెక్టర్, ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న స్టార్ హీరో కూడా ఉన్నారు. వారు ఎవరో గుర్తుపట్టారా?
విక్టరీ వెంకటేష్.. టాలీవుడ్ లో మహిళా ప్రేక్షకుల ఆదరణ పొందిన హీరోల్లో అగ్రస్థానంలో ఉంటారు. ఇక తనదైన కథల ఎంపికతో టాలీవుడ్ లో సినిమాలు చేసుకుంటూ.. ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో రానాతో కలిసి నటిస్తున్నాడు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే వెంకటేష్ పాత ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పిక్ వైరల్ గా మారడానికి ప్రధాన కారణం.. ఆ ఫొటోలో ఓ స్టార్ డైరెక్టర్ తో పాటుగా, ఓ స్టార్ హీరో సైతం ఉన్నాడు. ‘నువ్వునాకు నచ్చావ్’ సినిమా షూటింగ్ సెట్లో.. పిల్లలతో ముచ్చటిస్తున్నారు వెంకటేష్. ఈ పిక్ లో ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ గా వెలుగొందుతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నారు.
ఈ ఫొటోలో నెత్తిన కర్చిప్ వేసుకుని దానిపై టోపీ పెట్టుకుని వెరైటీ స్టైల్లో దర్శనం ఇస్తున్నాడు మాటల మాంత్రికుడు. నువ్వునాకు నచ్చావ్ సినిమాకు మాటలు అందించింది త్రివిక్రమ్. దాంతో ఆ షూటింగ్ స్పాట్ లో వెంకటేష్ తో కలిసి ఉన్నాడు. ఇక ఈ ఫొటోలో నల్ల టీ షర్ట్ వేసుకుని కనిపిస్తున్న కుర్రాడు మరెవరో కాదు.. టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ ‘రామ్ పోతినేని’. క్యూట్ గా ఉన్న రామ్ ను చూసి లేడీ ఫ్యాన్స్.. టీనేజ్ లో రామ్ భలే అందంగా ఉన్నాడు కదు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం త్రివిక్రమ్.. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.