పాన్ ఇండియా ట్రెండ్ వచ్చాక అందరు హీరోలు అదే బాటలో అడుగులు వేస్తున్నారు. టాలీవుడ్ లో లవర్ బాయ్ నుండి మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న హీరోలలో రామ్ ఒకరు. కెరీర్ లో లవర్ బాయ్ క్యారెక్టర్స్ చాలా చేసిన రామ్.. ఇస్మార్ట్ శంకర్ నుండి మాస్ యాంగిల్ లో సినిమాలు చేస్తున్నాడు.
పాన్ ఇండియా ట్రెండ్ వచ్చాక అందరు హీరోలు అదే బాటలో అడుగులు వేస్తున్నారు. అందరూ కాకపోయినా స్టార్డమ్ హై ఉన్న హీరోలు తమ సినిమాలను పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేసే ఆలోచన చేస్తున్నారు. టాలీవుడ్ లో లవర్ బాయ్ నుండి మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న హీరోలలో రామ్ ఒకరు. కెరీర్ లో లవర్ బాయ్ క్యారెక్టర్స్ చాలా చేసిన రామ్.. ఇస్మార్ట్ శంకర్ నుండి మాస్ యాంగిల్ లో సినిమాలు చేస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ కి రెడ్, ది వారియర్ సినిమాలు నిరాశే మిగిల్చాయి. దీంతో రామ్ కి ఇప్పుడు వరుస ప్లాప్స్ లో పడినట్లయింది. ఇలాంటి తరుణంలో మరోసారి పక్కా మాస్ ఎంటర్టైనర్ తో అలరించాలని ఫిక్స్ అయిపోయాడు.
అఖండ లాంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఇప్పుడు రామ్ కొత్త సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్న ఈ సినిమాపై.. రామ్, బోయపాటిల కాంబినేషన్ అనౌన్స్ అయినప్పుడే ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోయాయి. ఎందుకంటే.. మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి మ్యాజిక్ గురించి.. తెరపై హీరోలను ప్రెజెంట్ చేసే విధానంపై ఫ్యాన్స్ కి గట్టి నమ్మకం ఉంది. సినిమాల ఫలితం ఎలా ఉన్నప్పటికీ.. హీరోలలో ఉన్న పక్కా మాస్ యాంగిల్ ని పూర్తిస్థాయిలో బయటికి తీసుకు రాగలడనే పేరు బోయపాటికి ఉంది. ఈ క్రమంలో రామ్ ని ఎలాంటి మాస్ స్క్రిప్ట్ తో ప్రెజెంట్ చేస్తాడో అనే ఆసక్తి అందరిలోను నెలకొంది.
ఇలాంటి తరుణంలో ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ రూమర్ సోషల్ మీడియా వైరల్ గా మారింది. సాధారణంగా ఛాలెంజింగ్ రోల్స్ ఏవైనా చేయడానికి హీరోలెప్పుడూ ఇంటరెస్ట్ గానే ఉంటారు. అలా బోయపాటి సినిమాతో రామ్ తనలోని ఓ కొత్త కోణాన్ని కూడా ఆవిష్కరించబోతున్నట్లు టాక్. అదేంటంటే.. బోయపాటి సినిమాలలో డ్యూయెల్ రోల్స్ ఎక్కువగా చూస్తుంటాం. అలా ఈసారి రామ్ ని కూడా అలాగే చూపించాలని చూస్తున్నాడట. ఈ సినిమాలో హీరో రామ్ కి 50 ఏళ్ళ తండ్రి క్యారెక్టర్ ఉందట. ఆ క్యారెక్టర్ ని కూడా రామ్ చేతే చేయించాలని, రామ్ కూడా అందుకు ఆసక్తిగానే ఉన్నాడని సమాచారం. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఆ పాత్ర సినిమాని మలుపుతిప్పే రేంజ్ లో పవర్ ఫుల్ గా ఉండబోతుందని సినీవర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన రామ్ 50 ఏళ్ళ వ్యక్తిగా కనిపించి సాహసం చేయబోతున్నాడని అంటున్నారు. దీనిపై ఇంకా మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ కాగా.. చిట్టూరి శ్రీనివాస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఒకవేళ రామ్ నిజంగానే 50 ఏళ్ళ వ్యక్తి పాత్రలో రామ్ కనిపిస్తే ఎలా ఉంటుందో అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.