స్టార్ పూరీ జగన్నాథ్ మూవీ కెరీర్ రిస్కులో పడినట్లు కనిపిస్తోంది. మరోసారి ఆ హీరోనే నమ్ముకున్నట్లు అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
సినీ ఇండస్ట్రీలో దర్శకుడికి ఫ్లాప్ పడితే అంతే సంగతులు. అతడి కెరీర్ ఒక్కసారిగా పాతాళంలో పడిపోతుంది. ఎన్ని హిట్స్ పడ్డాయనేది ముఖ్యం కాదు.. ప్లాప్ ఇవ్వకపోతే చాలు అని ప్రేక్షకులు భావిస్తుంటారు. కొరటాల శివ టాప్ హీరోలతో వరుస పెట్టి హిట్స్ కొట్టినా.. ‘ఆచార్య’ ఫలితంతో అతనిని చాలా విమర్శించారు. డైరెక్టర్ శంకర్ పరిస్థితి వీటికి భిన్నం కాదు. రోబో సినిమా వరకు సౌత్ ఇండియాలోనే టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఇతడిని.. ‘ఐ’, ‘రోబో 2.0’ ప్లాప్ కావడంతో తెగ ట్రోల్ చేశారు. ఇప్పుడో తెలుగు డైరెక్టర్ గురించి పైన ఇద్దరి కంటే కాస్త భిన్నమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి. అతడే డాషింగ్ డైరెక్టర్ పూరీజగన్నాథ్.
ఇక వివరాల్లోకి వెళ్తే.. పూరీ జగన్నాథ్ మూవీ డైరెక్టర్ గా చాలా అప్ అండ్ డౌన్స్ చూశాడు. ‘బిజినెస్ మేన్’కు ముందు వరుస ప్లాపులు చూశాడు. కానీ మహేష్ తో తీసిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత మళ్ళీ హిట్ అందుకోవడానికి చాలా టైమ్ పట్టింది. అలా రామ్ తో “ఇస్మార్ట్ శంకర్” తీసి హిట్ కొట్టాడు. ఈ సినిమా ఇచ్చిన జోష్ లో విజయ్ దేవరకొండ తో ఏకంగా పాన్ ఇండియా లెవల్లో ‘లైగర్’ తీశాడు. అది కాస్త బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది. వరస్ట్ మూవీగా ట్రోలింగ్ కు గురైంది. ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు చాలా నష్టాలను మిగల్చడంతో.. విజయ్ దేవరకొండతోనే తీస్తున్న ‘జనగణమన’ ఆగిపోయింది. దీంతో పూరీ నెక్స్ట్ సినిమా ఏంటని అందరూ వెయిట్ చేస్తున్నారు.
ప్రస్తుతం పూరీ జగన్నాథ్ కెరీర్ రిస్క్ లో ఉంది. చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్స్ తో సినిమాలు చేస్తాడని టాక్ వచ్చింది కానీ అవి ఇప్పట్లో జరిగేలా కనిపించట్లేదు. వేరే హీరోలు కూడా పూరీతో సినిమా చేసేందుకు రెడీగా లేరు. దీంతో ఈ డైరెక్టర్ చూపు ‘ఇస్మార్ట్ శంకర్’ సీక్వెల్ పై పడింది. రామ్ కు స్టోరీ వినిపించడం అతడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అన్ని జరిగిపోయాయట. పూరీకి వేరే అవకాశం లేక మళ్లీ రామ్ నే నమ్ముకున్నట్లు కనిపిస్తుంది. ఒకవేళ ఈ ప్రాజెక్టు కన్ఫర్మ్ అయి హిట్ అయిందా సరేసరి లేదంటే మాత్రం పూరీ జగన్నాథ్.. ఇక టాలీవుడ్ లో చరిత్రనే. మరి పూరీ జగన్నాథ్ ప్రస్తుత పరిస్థితిపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.