ప్రముఖ దర్శకులు టీఎస్ జ్ఞానవేల్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటించిన ‘జై భీమ్’ సెన్సేషనల్ హిట్ అయ్యింది. ‘జై భీమ్’ సినిమాలో అడివి బిడ్డలకు జరిగిన అన్యాయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇందులో సూర్య అడవి బిడ్దల తరుపున న్యాయ పోరాటం చేసే లాయర్ పాత్రలో కనిపించి అదరగొట్టారు. గిరిజనులు, మహిళలపై పోలీసులు దాడులు చేయడం, లేనిపోని కారణాలతో అమాయకులని వేధిస్తున్న నేపథ్యంలో లాయర్‌గా సూర్య వారికి ఎలా అండగా నిలిచారు అనేది కథాంశం.
1993లో తమిళనాడులో రాజాకన్ను సతీమణి పార్వతమ్మ జీవితానికి సంబంధించిన వాస్తవిక కథనంతో తెరకెక్కించారు. పోలీసుల దాష్టీకానికి బలైపోయిన రాజాకన్ను సతీమణి పార్వతమ్మ ఇప్పటికీ జీవించే ఉన్నారు. ఇక జై భీమ్ సినిమా చూసిన దర్శకుడు, నటుడు లారెన్స్, సినతల్లి పాత్ర చూసి చలించిపోయారు. ప్రస్తుతం పార్వతమ్మ కడు పేదరికంలో జీవిస్తున్న విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న రాఘవ లారెన్స్ ఆమెకు ఇల్లు కట్టిస్తానని ఇటీవల ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
తాజాగా రాఘవ లారెన్స్ పార్వతమ్మని కలిసి ఆయన ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాడు. సోమవారం లారెన్స్ పార్వతమ్మను కలిసి ఆయన చెప్పినట్టుగానే ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా పార్వతమ్మతో లారెన్స్ మాట్లాడుతూ.. తన బామ్మలాగే ఉన్నావని, ఆమె ఇప్పుడు లేదు కనుక తన రూపాన్ని మీలో చూసుకుంటాను అంటూ చెక్ అందచేశారు. అంతే కాదు వెళ్లేముందు పార్వతమ్మ కాళ్లకు నమస్కారం చేసి ఆశీస్సులు సైతం అందుకున్నారు. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా లారెన్స్ ఇలాంటి ఎన్నో గొప్ప పనులు చేస్తున్నందుకు ఫ్యాన్స్ ఆయనకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. తాజాగా రాఘవ లారెన్స్, పార్వతమ్మని కలిసి ఆశీర్వాదం తీసుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
A house for Rajakannu’s family 🙏🏼 #JaiBhim #Suriya @Suriya_offl @2D_ENTPVTLTD @rajsekarpandian @tjgnan @jbismi14 @valaipechu pic.twitter.com/nJRWHMPeJo
— Raghava Lawrence (@offl_Lawrence) November 8, 2021