శరీరంలో అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నవారు.. తమకు ఇంకేదో తక్కువైందని దేవుడిని నిందిస్తుంటారు. అలానే చిన్న పరాజయం పొందగానే తీవ్ర నిరాశకు గురవుతుంటారు. ఇంకా దారుణం ఏమిటంటే తాము జీవితంలో ఏమి సాధించలేకపోయమని మానసిక వేదనకు గురై... ఆత్మహత్యలు సైతం చేసుకుంటున్నారు. కానీ కొందరు వైకల్యం తమను పీడిస్తున్నా.. మొక్కవోని ధైర్యంతో ముందుకుసాగుతూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంటారు. ఆ కోవాకు చెందిన వ్యక్తే తెలంగాణకు చెందిన భాగ్య. వైకల్యం విసిరిన సవాళ్లకి ఎదురీది. విజేతగా నిలిచింది.
శరీరంలో అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నవారు.. తమకు ఇంకేదో తక్కువైందని దేవుడిని నిందిస్తుంటారు. అలానే చిన్న పరాజయం పొందగానే తీవ్ర నిరాశకు గురవుతుంటారు. ఇంకా దారుణం ఏమిటంటే తాము జీవితంలో ఏమి సాధించలేకపోయమని మానసిక వేదనకు గురై… ఆత్మహత్యలు సైతం చేసుకుంటున్నారు. కానీ కొందరు వైకల్యం తమను పీడిస్తున్నా.. మొక్కవోని ధైర్యంతో ముందుకుసాగుతూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంటారు. ఆ కోవాకు చెందిన వ్యక్తే తెలంగాణకు చెందిన భాగ్య. వైకల్యం విసిరిన సవాళ్లకి ఎదురీది.. ఆమె ఎలా విజయతీరాల చేరింది. మరి..ఆమె సక్సెస్ సోరీ ఇప్పుడు తెలుసుకుందాం..
తెలంగాణ రాష్ట్రం మహబాబుబాద్ జిల్లా గూడురు చెందిన ఓ పేద కుటుంబంలో భాగ్య జన్మించారు. అమ్మ కూలి పనులకు వెళ్తే.. నాన్న మేకలు కాస్తూ కుటుంబాని పోషించే వారు. భాగ్యకు ఓ సోదరుడు కూడా ఉన్నాడు. అయితే ఆమె పుట్టడమే ఓ విచిత్రంగా పుట్టింది. భాగ్య పుట్టడమే ఓ కాలు లేకుండా పుట్టింది. అలా పుట్టిన భాగ్యాను అందరు విచిత్రంగా చూశారంట. అలానే ఆమె విద్యాభ్యాసం కూడా చాలా కష్టంగా సాగింది. ప్రభుత్వ కాలేజీకి వెళ్లాలంటే.. రెండు బస్సులు మారి వెళ్లాల్సిన పరిస్థితి. భాగ్య వెళ్లలేదని ఆమె తల్లిదండ్రులు ప్రైవేట్ కాలేజీలో చేర్చారు. ప్రముఖ డాన్సర్ లారెన్స్ మాస్టార్ ఆలోచనే తనను డాన్సర్ గా మారేలా చేసిందంట.
లారెన్స్ దగ్గర పనిచేసే.. ప్రశాంత్ మాస్టార్ స్పెషల్లీ ఏబుల్డ్ పిల్లలకు డాన్స్ నేర్పించడానికి భాగ్య ఉంటున్న హాస్లల్ కి వెళ్లారు. 10 మందికి పైగా శిక్షణ ఇవ్వగా అందులో భాగ్యతో పాటు మరో ఇద్దరే స్టేజ్ పై ప్రదర్శనలిచ్చే స్థాయికి చేరారు. శిక్షణలో భాగంగా కర్ర లేకుండా ఒక కాలి మీద శరీరాన్ని బాలెన్స్ చేయడం ప్రాక్టీస్ చేశారు. అలానే ఒంటి కాలి మీద బాలెన్స్ సాధించేందుకు నెల సమయం పట్టింది. ఇక ఆతరువాత సినిమా పాటలు, జానపద నృత్యం,బతుకమ్మ పాటలు ప్రాక్టీస్ చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న భాగ్య అనేక కార్యక్రమాల్లో ప్రదర్శనలు చేశారు.
అలానే టీవీ షోల్లో కూడా భాగ్య డాన్స్ చేశారు. నడవలేని స్థితి నుంచి స్టేజిపై నృత్యాలు చేసే స్థాయికి భాగ్య చేరుకోవడంపై ఆమె తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. తన ప్రయాణం గురించి అనేక ఆసక్తికర విషయాలు తెలిపారు. నా పరిస్థితి గురించి ఆలోచించి తొలుత బాధపడ్డాను. ఆ తరువాత నేను ఎవరికీ భారం కాకూడదు, నా కాళ్ల మీద నేను నిలబడాలనే పట్టుదలే నన్ను ఈ స్థాయికి చేర్చింది” అని భాగ్య తెలిపారు. ప్రస్తుతం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జానపద కళ్లలో ఎం.ఏ చేస్తున్నారు.
ఆమె చదువుతున్న యునివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ కిషన్ రావు.. ఇతర అధికారులు సహాకారంతో ఆమెకు జర్మనీ నుంచి ప్రోస్థటిక్ లెగ్ ను తెప్పించారు. ఆ కాలితో నడక ప్రాక్టీస్ చేస్తుంది. ఆ నడక మీద పట్టు వచ్చిన తరువాత డ్యాన్స్ చేస్తానని ఆమె తెలిపారు. నడవలేని స్థితి నుంచి స్టేజిపై నాట్యం చేసే స్థాయికి చేరిన ఈ తెలంగాణ నాట్య మయూరి యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది. మరి..ఈ నాట్య మయూరి సక్సెస్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.