సమాజం నుంచి చాలా తీసుకున్నాం. తిరిగిచ్చేయాలి. లేకపోతే లావైపోతాం అని చెప్పి చాలా మంది ప్రముఖులు సేవా కార్యక్రమాల దూరంలో ఏదో రకంగా తిరిగి ఇచ్చేస్తున్నారు. ఆర్థిక ఊబకాయంతో బాధపడి చచ్చేకంటే పది మంది ఆర్ధిక సమస్యలను తీర్చి.. చచ్చాక కూడా చరిత్రలో జీవించే అదృష్టం చాలా తక్కువ మందికి ఉంటుంది. అలాంటి అరుదైన అదృష్టం, గౌరవం కోసం కొంతమంది ఆపదలో ఉన్న వారిని ఆడుకుంటారు. వారికి సొంత డబ్బుతో వైద్యం చేయిస్తుంటారు. పిల్లలను దత్తత తీసుకుంటూ ఉంటారు. వారిని చదివించి గొప్పవారిగా తీర్చిదిద్దుతుంటారు. అలాంటి గొప్పవారిలో రాఘవ లారెన్స్ ఒకరు.
ఏ మనిషీ తన కష్టంతో మాత్రమే ఎదగరు. ఆ మనిషి ఎదుగుదలలో సమాజం పాత్ర కూడా ఉంటుంది. ఒక పారిశ్రామికవేత్త అయినా, వ్యాపారవేత్త అయినా, రాజకీయ నాయకుడైనా, సినిమా ప్రముఖుడైనా మరెవరైనా గానీ వారి ఎదుగుదల కింద ఎన్నో జీవితాలు ఉంటాయి. ఈ సమాజం అంతా కలిస్తేనే వీళ్ళు ఎదుగుతారు. వీళ్ళు చెమటోడ్చి కష్టపడి సంపాదించిన సొమ్మే గొప్ప వాళ్ళ జేబుల్లోకి వెళ్తున్నాయి. అయితే ఈ ఇంగితం తెలిసిన వారు సమాజానికి తిరిగి ఇచ్చేస్తుంటారు. సమాజం నుంచి చాలా తీసుకున్నాం తిరిగిచ్చేయాలి, లేదంటే లావైపోతాం అని చెప్పి సేవా కార్యక్రమాల రూపంలో వెనక్కి తిరిగిచ్చేస్తుంటారు. అలాంటి శ్రీమంతులలో రాఘవ లారెన్స్ ఒకరు. రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
డ్యాన్స్ మాస్టర్ గా, బెస్ట్ కొరియోగ్రాఫర్ గా, నటుడిగా, దర్శకుడిగా విజయ పరంపర కొనసాగిస్తున్నారు. సినిమాలు చేస్తూనే చిన్న పిల్లలను దత్తత తీసుకుని సొంత ఖర్చుతో చదివిస్తున్నారు. ఇప్పటికే లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది చిన్నారులకు తన వంతు సాయం చేసిన లారెన్స్.. తాజాగా 150 మంది చిన్నారులను దత్తత తీసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. నాణ్యమైన విద్యను అందిస్తానని వాగ్దానం చేశారు. తనకు సినీ ప్రేక్షకులు, అభిమానుల ఆశీస్సులు కావాలని కోరారు. రుద్రన్ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో భాగంగా ఆ చిన్నారులతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
లారెన్స్ ది ఎంత గొప్ప మనిషో అంటూ ఫ్యాన్స్, నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ ఒక్క విషయంలోనే కాదు గతంలో అనేక సందర్భాల్లో తన ఉదారత చాటుకున్నారు. అప్పట్లో 141 మంది చిన్నారులకు శస్త్రచికిత్స చేయించారు. తమిళనాడులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో చిన్నారులెవరికైనా గుండెకు శస్త్రచికిత్స చేయించాలన్న, ఆర్థిక సమస్య కారణంగా చదువుకు దూరమవుతున్నారని తెలిసినా వెంటనే లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ ను సంప్రదించాలని ఆయన కోరారు. సొంత డబ్బుతో ఇదంతా చేయడం ఎలా సాధ్యం అంటే.. అది నా డబ్బు కాదు, మీరు ఇచ్చిన డబ్బే.. తిరిగి మీకే ఇస్తున్నా అని సమాధానం చెప్తారు. అంత గొప్ప మనిషి లారెన్స్.
ఈయన నటించిన రుద్రన్ సినిమా తెలుగులో రుద్రుడు పేరుతో ఈ నెల 14న విడుదల కానుంది. మరోవైపు చంద్రముఖి 2 సినిమాలో కూడా నటిస్తున్నారు. వాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి చిన్నారులను దత్తత తీసుకుని వారిని చదివిస్తున్న లారెన్స్ కి ఒక సెల్యూట్ చేయండి. అలానే మీ ఆశీస్సులు ఆయనకు తెలియజేయండి. అందరి బాగు కోరుకునే ఆయన బాగుండాలని ఆ భగవంతుడ్ని కోరుకుందాం.
https://youtube.com/shorts/vgUlhq77GaY?feature=share