సమంత, నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత సమంతపై అనేక పుకార్లు వచ్చాయి. పిల్లలు వద్దనుకుందని, ఎవరితోనో రిలేషన్ షిప్ పెట్టుకుందని ఇలా రకరకాల వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. వాటిపై సమంత కూడా స్పందించారు. కాగా ఇప్పుడు ఆమె స్టైలిస్ట్ ప్రీతమ్ జుల్కర్ తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించాడు. విడాకుల విషయంలో తనతో పాటు సమంతపై వస్తున్న ట్రోలింగ్‌పై నాగచైతన్య స్పందించాలని ప్రీతమ్ కోరాడు.
చైతూ స్పందించకపోవడం బాధ కలిగిస్తోందని అన్నాడు. తాను సమంతను అక్క అని పిలుస్తానని, ఈ విషయం చైతూతో పాటు చాలామందికి తెలుసని పేర్కొన్నాడు. అటు సమంత బాధలో ఉన్న ఈ సమయంలో తాను ట్రోలింగ్‌కు భయపడకుండా ఆమెకు అండగా ఉంటానని ప్రీతమ్ స్పష్టం చేశాడు. కాగా వీరి ఇద్దరి రిలేషన్ షిప్‌పై దారుణమై ఊహాగానాలు ప్రసారమయ్యాయి. దీనిపై పోలీసులను కూడా సమంత ఆశ్రయించనున్నట్లు సమాచారం.