అక్టోబర్ 10 న జరగనున్న మా అసోసియేషన్ ఎన్నికలు రాను రాను వేడెక్కుతున్నాయి. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య గట్టి పోటీ నెలకొని ఉంది. ఇద్దరు ప్యానల్ సభ్యులు ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకుంటూ మేమె గెలుస్తాం అని మీడియా లో డిబేట్స్ ఇస్తున్నారు. ఇవాళ పోస్టల్ బ్యాలెట్ అర్హత ఉన్న సభ్యుల నుంచి విష్ణు ప్యానెల్ సంతకాలు సేకరిస్తుందని ప్రకాష్ రాజ్ ఆవేదనను వ్యక్తం చేశారు.
తాజాగ ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన.. మా లో పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగం అవుతుందని, ఏజెంట్ల ద్వారా పోస్టల్ బ్యాలెట్ కుట్ర చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక 60 ఏళ్లు పైబడిన నటీనటులు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ కు అర్హులని అన్నారు. దీంతో పాటు కృష్ణ, కృష్ణంరాజు, శారద, పరిచూరి బ్రదర్స్, శరత్ బాబు వాళ్ల పోస్టల్ బ్యాలెట్స్ డబ్బులు కూడా మోహన్ బాబు మేనేజర్ వచ్చి కట్టారని ప్రకాశ్ రాజ్ మీడియా ముఖంగా తెలిపాడు. అలాగే 56 మంది సభ్యులకు రూ. 28000 వేల సింగిల్ చెక్ రూపంలో మా ఎలెక్షన్ ఆఫీసర్ కి కట్టారు. వాళ్ళు రిషిప్ట్స్ కూడా ఇవ్వడంతో పాటు మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకున్నారు. వీటిన్నిటిని మీడియాకు ఇచ్చానని ప్రకాష్ రాజ్ తెలియజేశారు.
ఇక దీంతో పాటు హైదరాబాద్, వైజాగ్, చెన్నై, ముంబై లలో ఉంటున్న 60 ఏళ్ల పైబడిన వారి డబ్బులు కూడా మంచు విష్ణు వాళ్ల వ్యక్తే కట్టారని, ఇంత దారుణంగా మా ఎలక్షన్స్ జరగటం అవసరమా అంటూ ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. నిన్న సాయంత్రం కూడా ఒక వ్యక్తి 56 మందికి పోస్టల్ బ్యాలెట్ డబ్బు కట్టారు. ఈ విషయంపై సినీ ప్రముఖులైన కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున, మురళీమోహన్ దీనికి సమాధానం చెప్పాలి అంటూ ప్రకాష్ రాజ్ మీడియా ద్వారా ప్రశ్నించారు. అయితే పోస్టల్ బ్యాలెట్ లో ఓటు వేయాలంటే వ్యక్తిగతంగా మా కు లేఖ రాయటంతో పాటు అడ్రెస్, సంతకం పెట్టి ఒక ఏజెంట్ ద్వారా లెటర్ పంపించి డబ్బు కట్టాలని తెలిపాడు ప్రకాష్ రాజ్.
మేమే గెలిస్తామని స్ట్రాంగ్ గా ఫుల్ కాన్ఫిడెంట్ తో విష్ణు చెబుతుంటే ఎంతో అని చిన్న కన్ఫ్యూజన్ ఉండేది. అది ఇలాగేనా అని ఇప్పుడు అర్థం అవుతుంది అంటూ ప్రకాష్ రాజ్ ఆవేదన వెళ్లగక్కాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేయడం కూడా వ్యర్ధమని, ఓటర్లు సంతకాలు కూడా తీసుకొని వారికి డబ్బులు చెల్లిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మా ఎన్నికల్లో అధ్యక్షుడిగా నిలబడటం కూడా సిగ్గు చేటు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 60 మంది ఓటర్లు ని ప్రలోభ పెట్టి ఓట్లు కొనేస్తున్నారు. దీనిపై పై ఖచ్చితంగా అధికారులకి కంప్లైంట్ చేస్తామని మీ అజెండా ఎంటో చెప్పి నిజాయితీగా గెలవాలి అంటూ ప్రకాష్ రాజ్ ఎంతో ఆవేదనతో కన్నీటి పర్వంతం అయ్యారు.