ఉత్కంఠభరితంగా జరిగిన ‘మా’ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రకాశ్‌రాజ్ ప్యానల్ సభ్యులు అందరూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మూకుమ్మడి రాజీనామాలతో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మా అసోసియేషన్‌లో విరుద్ధ అభిప్రాయాలు ఉన్న సభ్యుల మధ్య సఖ్యత సాధ్యం కాదని అందుకే తాము రాజీనామా చేస్తున్నట్లు వారు ప్రకటించారు. ఎన్నికల్లో గెలుపొందిన విష్ణు ప్యానల్ సభ్యులే పూర్తిగా మా అసోసియేషన్‌లో ఉండి.
ఇచ్చిన హామీలను అన్ని నేరవేర్చాలని కోరారు. ఒక వేళ ఆ హామీలు నేరవేరకుంటే తాము వాటిని అడ్డుకున్నాం అనే ప్రచారం చేసే అవకాశం ఉంది కనుక తాము తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. అసోసియేషన్ బయట ఉన్నా కూడా తమ సహకారం ‘మా’కు ఉంటుందని, హామీలపై ప్రశ్నిస్తామని వారు తెలిపారు. ఈ సంచలన పరిణామంతో సినీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో సగటు సినీ అభిమానికి అర్థం కావడంలేదు.