బిగ్ బ్రేకింగ్.. మా సభ్యత్వానికి ప్రకాశ్ రాజ్ రాజీనామా!

Prakash Raj Press Meet

గత కొన్ని నెలల నుంచి ఎంతో హీట్ ను పుట్టించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఎట్టకేలకు ఎన్నికలు జరిగి మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో ఓటమిపై స్పందించిన ప్రకాష్ రాజ్ తాజాగా మీడియాతో మాట్లాడాడు. మా ఎన్నికలపై స్పందిస్తూ గెలిచిన మంచు విష్ణుకి, అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఓటర్ల తీర్పును అంగీకరిస్తున్నానని, దీంతో పాటు మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ప్రకాష్ రాజ్. సినీ ఆర్టిస్టులంతా తెలుగు వ్యక్తిని గెలుపించుకున్నారు.

ఇక మా ఎన్నికల్లో నాన్ లోకల్ అంశం బలంగా వినిపించిందని, నేను తెలుగు వ్యక్తిని కాదు కాబట్టి మా అధ్యక్షుడిగా ఓటర్లు అంత తిరస్కరించారు. వారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని తెలిపారు. కానీ నేను తెలుగు వాడిగా పుట్టనందుకు నా తప్పు కాదని, నా తల్లిదండ్రుల తప్పు అంతకన్న కాదని ప్రకాష్ రాజ్ అన్నారు. దీంతో ఇక నుంచి మా అసోసియేషన్ తో నాకు సంబంధం లేదని, అతిధిగా వచ్చాను, అతిథిగానే సినిమాలు చేసుకుంటానని భావోధ్వేగంతో ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. ఇక ప్రకాష్ రాజ్ మా అసోసియేషన్ సభ్యత్వానికి రాజీనామా చేయటంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.