‘పవన్‌ ఫ్యాన్స్‌’కు భారీ షాక్‌.. స్క్రీన్‌ పై ‘పవర్‌స్టార్‌’ కనిపించదా?

మెగాస్టార్‌, పవర్‌ స్టార్‌, సూపర్‌ స్టార్‌, మెగా పవర్‌ స్టార్‌, రెబల్‌ స్టార్‌, అబ్బో ఒకటా రెండా.. టాలీవుడ్‌లో లెక్కలేనంత మంది స్టార్లు ఉన్నారు. వారి అభిమాన హీరో పేరుకు ముందు ఆ స్టార్‌ బిరుదుని చూసి చొక్కాలు చించుకునే ఫ్యాన్స్‌ ఎందరో. అలాంటి బిరుదులు టాలీవుడ్‌ తొలినాళ్ల నుంచి ఉన్నాయి. ఇకపై కూడా ఉంటాయి. ఈ బిరుదులపై విమర్శలు, వ్యతిరేకతలు కూడా లేకపోలేదు. హీరోలకు ఆన్‌ స్క్రీన్‌, ఆఫ్‌ స్క్రీన్‌ తోకలు ఎందుకు అన్న ప్రశ్నలు వినిపిస్తూనే ఉంటాయి.

powerstarఅలాంటి సంప్రదాయాన్ని పవన్‌ కల్యాణ్‌ కూడా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపై తన సినిమాల్లో ఆన్‌స్క్రీన్‌ ‘పవర్‌ స్టార్‌’ బిరుదు కనిపించకూడదని ఆదేశించినట్లు సమాచారం. భీమ్లానాయక్‌ పోస్టర్‌ను గమనిస్తే మనకు అది నిజమేనేమో అన్న అనుమానం రాకపోదు. పవన్‌ కల్యాణ్‌ యాస్‌ భీమ్లానాయక్‌ అని మాత్రమే ఉంది. హరిహర వీరమల్లు ఫస్ట్‌ గ్లిమ్స్‌లో పవర్‌ స్టార్‌ ఉపయోగించిన డైరెక్టర్‌ క్రిష్‌.. సెప్టెంబర్‌ 2న ఇచ్చిన అప్‌డేట్‌లో ‘పవర్‌స్టార్‘ అనే బిరుదు లేదు. ఇకపై వచ్చే అన్ని సినిమాల్లో కేవలం పవన్‌ కల్యాణ్‌ అనే ఉండాలని దర్శకులు, నిర్మాతలకు పవన్‌ స్పష్టం చేశారంట. మరి పవర్‌ స్టార్‌ అన్న బిరుదు లేకపోవడం, వాడకపోవడం అంటే అభిమానులకు చాలా కష్టమనే చెప్పాలి.

పవన్‌ కల్యాణ్‌ అని వాడేది తక్కువ.. పవర్‌ స్టార్‌ అన్ని బిరుదునే పేరుగా మార్చేశారు అభిమానులు. మరి, ఈ వార్త విన్నాక ఎలా స్పందిస్తారో చూడాలి.