సినిమా బండి మే 14కి రడీ అండీ!.. నెట్ ఫ్లిక్స్ లోనే నండీ!..

కథలే హీరోలుగా వచ్చిన చాలా సినిమాలు ఈమధ్య కాలంలో మంచి హిట్లయ్యాయి. ఉదాహరణకు ‘కేరాఫ్ కంచరపాలెం’. ఇందులో నటించినవారు ఒక్కరంటే ఒక్కరు కూడ ప్రేక్షకులకు తెలిసినవాళ్ళు కాదు. కానీ సినిమా మ్యాజిక్ చేసింది. అందుకు కారణం అందులోని కథే. ‘లాంగ్‌ డ్రైవ్‌’, ‘వై మీ’ వంటి షార్ట్‌ఫిల్మ్స్‌తో నెటిజన్లకు చేరువైన దర్శకుడు ప్రవీణ్‌. ప్రస్తుతం ఆయన దర్శకుడిగా పూర్తి స్థాయి నిడివి ఉన్న చిత్రంతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకునేందుకు సిద్ధమవుతున్నారు. విభిన్నకథతో ఆయన తెరకెక్కించిన సరికొత్త చిత్రం ‘సినిమా బండి’.

download 8

ఓ వ్యక్తి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. అయితే, ఓ రోజు అతని ఆటోలో ఎవరో ప్రయాణికుడు కెమెరా మరిచిపోయి వెళ్లిపోతాడు. సినిమాపై ఉన్న మక్కువ వల్ల దొరికిన కెమెరా సాయంతో తన ఊరిలోనే ఉన్నవారిని పెట్టి సినిమా తెరకెక్కించే పనిలో పడతాడు. అదే సమయంలో కెమెరాని పోగొట్టుకున్నవాళ్లు దాని కోసం వెనక్కి వస్తే..? ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే ఆ వ్యక్తి సినిమా పూర్తి చేయగలిగాడా? అనే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కినట్లు ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది.

download 9

మే 14న ‘సినిమా బండి’ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.చేతిలో కెమెరా తప్ప ఇంకేమీ లేని ఆ బృందం సినిమా తీయడానికి పడిన పాట్లే ఈ సినిమా. ట్రైలర్ చూస్తే బలమైన కంటెంట్ ఉన్న సినిమానే అనిపిస్తోంది. ప్రతి ఒక్కరిలోనూ ఫిలిం మేకర్ ఉంటాడు అని చెప్పడమే కథకుడి అంతరంగమని అర్థమవుతోంది. మే 14న నెట్ ఫ్లిక్స్ ద్వారా చిత్రం రిలీజ్ కానుంది. మరి గమ్మత్తైన కథ కలిగిన ఈ చిన్న సినిమా ఎంత మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here