మా ఎన్నికలపై మోహన్ బాబు సంచలన కామెంట్స్!

గత కొన్ని రోజులుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’లో నెలకొంటున్న రగడ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇప్పటికే ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్ కి మద్య హూరా హూరీ పోటీ నెలకొంది. ఈ ప్యానెల్స్ లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఒకరిపై ఒకరు మాటల యుద్దాలకు దిగుతున్నారు. తాజాగా ‘మా’ ఎన్నికల విషయం గురించి మంచు మోహన్ బాబు ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.

chiarage minనీచ, నికృష్ణ, దరిద్రగొట్టు, భ్రష్టు రాజకీయాలు మా ఎన్నికల సందర్భంగా నెలకొన్నాయని వివరించారు. తెలిసినవాడు, తెలియనివాడు, వెధవలు, క్యారెక్టర్స్ లేనివాళ్లు కొంతమంది అదేదో కిరీటం అనుకుని, అద్భుతం అనుకుని ఏవేవో మాట్లాడుతున్నారు అని విమర్శించారు. గజరాజు వెళుతుంటే కుక్కలు మొరుగుతుంటాయని, ప్రతివాటికి బదులివ్వాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. ఇక మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ.. చిరంజీవి నాకు ఎప్పటికీ మంచి స్నేహితుడు.. ఆ కుటుంబంతో మా బంధం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది.

ఇదీ చదవండి : షారుఖ్ కొడుకు ఆర్యన్ తో పాటు అరెస్టైన అమ్మాయి ఎవరో తెలుసా

magch minనాగబాబు, అల్లు అరవింద్ పిల్లలను తన పిల్లలుగానే భావిస్తానని వెల్లడించారు. చిరంజీవి కుటుంబం నుంచి ఎవరైనా మా ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే, వారు తనతో ఎన్నికలకు సంబంధించిన ప్రతిపాదన చేస్తే తాను విష్ణుతో ఉపసంహరింపజేసేవాడ్నని అన్నారు. గత కొన్ని రోజులుగా ‘మా’లో జరుగుతున్న పరిణామాలు చూసి నాకే సిగ్గు వేస్తుందని అన్నారు. కృష్ణ, కృష్ణం రాజు వద్దకు వెళ్లి ఆశీస్సులు మాత్రమే తీసుకున్నామని తెలిపారు.