కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన 71వ పుట్టిన రోజు సందర్భంగా సుమన్ టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. నేను రాజకీయాలకు పనికిరాను అంటూ.. భవిష్యత్ పొలిటికల్ ఎంట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.. టాలీవుడ్ లో విలక్షణ నటనకు పెట్టింది పేరు. కంచుకంఠంతో వెండితెరపై తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు మోహన్ బాబు. విలన్ గా, కామెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా ఇండస్ట్రీలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. సుదీర్ఘకాలం ఇండస్ట్రీలో స్టార్ యాక్టర్ గా పేరోందిన ఆయన, మార్చి 19న తన 71వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సుమన్ టీవీకి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ విలక్షణ నటుడు. సీనియర్ జర్నలిస్టు ప్రభు చేసిన ఈ ఇంటర్వ్యూ.. మెుదట సరదాగా సాగి, పోను పోను ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే రాజకీయా భవిష్యత్ గురించి ప్రభు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు మోహన్ బాబు. నేను రాజకీయాలకు పనికి రాను అని సంచలన కామెంట్స్ చేశారు. మరి మోహన్ బాబు అంత పెద్ద స్టేట్ మెంట్ ఇవ్వడానికి కారణాలు ఏంటో? ఇప్పుడు తెలుసుకుందాం.
రాజకీయం ఓ చదరంగం.. అన్న నానుడిని ఎన్నో సంవత్సరాలు మనం వింటూనే ఉన్నాం. అదీకాక రాజకీయాలు చేయాలంటే ఎత్తులకు పై ఎత్తులు వేయాలి. ప్రత్యర్థి ఆలోచనలను చిత్తు చేస్తూ.. ఎన్నికల రణరంగంలో దూసుకుపోవాల్సి ఉంటుంది. అయితే ఈ రాజకీయాలు అందరికి సూట్ కావు, అందులో నేనూ ఒకడిని అంటున్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. తన 71వ పుట్టిన రోజు సందర్భంగా సుమన్ టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సీనియర్ జర్నలిస్టు ప్రభు చేసిన ఈ ఇంటర్వ్యూలో తన రాజకీయ భవిష్యత్ పై సంచలన స్టేట్ మెంట్ ఇచ్చారు మోహన్ బాబు. మీరు భవిష్యత్ లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా? అని జర్నలిస్టు ప్రభు ప్రశ్నించగా..”నేను గత ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నాను. దాంతో పొలిటికల్ గా ఎంట్రీ ఇస్తానని అందరు అనుకున్నారు. కానీ సీఎం జగన్ మా బంధువు కాబట్టి ఆ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లాల్సి వచ్చింది. ఇక పోతే నాలాంటి వాడు రాజకీయాలకు పనికి రాడు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవాడు రాజకీయాల్లో పనికి రాడు. 99 శాతం నేను రాజకీయాల్లోకి రాను” అంటూ సంచలన స్టేట్ మెంట్ ఇచ్చారు.