71వ పుట్టిన రోజు సందర్భంగా సుమన్ టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఈ ఇంటర్వ్యూలో తాను గత ఎన్నికల్లో వైసీపీకి ఎందుకు మద్దతు ప్రకటించానో వివరించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయా వర్గాల్లో ఆసక్తిగా మారాయి.
సినిమా రంగానికి, రాజకీయ రంగానికి అవినాభావ సంబంధం ఉంది అన్నది కాదనలేని సత్యం. ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలితలే ఇందుకు నిదర్శనం. ఇక వీరితో పాటుగా మరికొంత మంది నటీ, నటులు ఏదో ఒక పార్టీకి ప్రచారానికో, మద్ధతుగానో నిలిచిన సంఘటనలు చరిత్రలో ఉన్నాయి, ప్రస్తుతం కూడా ఉన్నాయి. భవిష్యత్ లో కూడా ఉంటాయి అనడంలో అతిశయోక్తిలేదు. ఈ క్రమంలోనే తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. మార్చి 19న తన 71 పుట్టిన రోజు సందర్భంగా సుమన్ టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు ఆయన. సీనియర్ జర్నలిస్టు ప్రభుతో జరిగిన ఈ ఇంటర్వ్యూలో ప్రస్తుత రాజకీయాల గురించి, ఏ కారణంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ పార్టీకి ప్రచారానికి వెళ్లాల్సి వచ్చిందో వివరించారు.
మోహన్ బాబు.. విలక్షనమైన నటుడిగా, విలన్ గా, కామెడీ విలన్ గా, హీరోగా, నిర్మాతగా, విద్యావేత్తగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు. ఈ క్రమంలో తన కెరీర్ లో ఎన్నో కష్టాలు పడ్డానని, తన కష్టాలు పగవాడికి కూడా రాకూడదు అని తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తన 71వ పుట్టిన రోజు సందర్భంగా సుమన్ టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఇక ఈ ఇంటర్వ్యూలో రాజకీయాలపై పలు ఆసక్తికర, షాకింగ్ కామెంట్స్ చేశారు ఆయన. ” ఎన్టీఆర్ చనిపోయాక ఏ సంఘటనతో మీకు రాజకీయాలపై ఇంత విరక్తి కలిగింది?” అని జర్నలిస్టు ప్రభు ప్రశ్నించగా.. మోహన్ బాబు ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ” ప్రస్తుతం ఆ విషయం అప్రస్తుతం. ఎప్పుడో జరిగిన దానిని మళ్లీ గుర్తుచేసుకోద్దు” అన్నారు.
ఇక TDPలో క్రమశిక్షణారాహిత్య కారణంగానే ప్రాథమిక సభ్యత్యానికి రాజీనామా చేశారా? అని ప్రభు ప్రశ్నించగా..” ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం జరిగిన దాని గురించి ఇప్పుడెందుకు ప్రభు. గతం గతః. వీటి గురించి ప్రస్తుతం జనాలకు అవసరం లేదు” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వైసీపీలో మీ ప్రాధాన్యం ఏమిటీ అని ప్రభు అడగ్గా..”నేను 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ పార్టీ ప్రచారానికి వెళ్లడానికి ప్రధాన కారణం సీఎం జగన్ మా బంధువు కావడం. అంతే తప్ప వేరే ఉద్దేశం నాకు లేదు. నేను ఏ పదవులు ఆశించి ప్రచారానికి వెళ్లలేదు” అంటూ చెప్పుకొచ్చారు మోహన్ బాబు. ప్రస్తుతం మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు ఇటు సినీ పరిశ్రమలో.. అటు రాజకీయా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మరి బంధువు కాబట్టే ప్రచారానికి వైసీపీ ప్రచారానికి వెళ్లాను అన్న మోహన్ బాబు వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.