షారుఖ్ కొడుకు ఆర్యన్ తో పాటు అరెస్టైన అమ్మాయి ఎవరో తెలుసా

ముంబయి– ప్రస్తుతం బాలీవుడ్ లో ఎక్కడ చూసినా బాద్ షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసు గురించే చర్చ జరుగుతోంది. ముంబై రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో షారూఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్‌ ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసింది. దీంతో ఈ అంశం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సంచలనం రేపుతోంది.

ముంబై నుంచి గోవా వెళ్తున్న క్రూయిజ్ లో రేవ్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు. అక్కడ షారుఖ్ కొడుకు ఆర్యన్ తో పాటు మరో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీళ్లంతా నిషేదిత డ్రగ్స్ సేవిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. వారి నుంచి కొంత మేర డ్రగ్స్ కూడా స్వాదీనం చేసుకున్నారు.

Mun Mun

షారుఖ్ కొడుడు ఆర్యన్ ఖాన్ తో పాటు అరెస్టైన ఏడుగురిలో ఓ అమ్మాయి కూడా ఉండటం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఇంతకీ ఆమె ఎవరా అని చాలా మంది గూగుల్ లో వెతుకుతున్నారు. ఆర్యన్ ఖాన్ బృందంలో ఉన్న అమ్మాయి పేరు మున్ మున్ ధమేచా. ఈ అమ్మాయి మధ్యప్రదేశ్ కు చెందిన బిజినెస్ ఫ్యామిలీకి చెందింది. ఈమె వయసు 39 ఏళ్లు.

మున్ మున్ ధమేచా ఓ ఫ్యాషన్ మోడల్. ఈమెకు తల్లిదండ్రులు లేరు. కొంత కాలం క్రితం మున్ మున్ తల్లిదండ్రులు మృతి చెందారు. ఆమెకు ఒక సోదరుడు ఉన్నాడు. అతడి పేరు ప్రిన్స్ ధమేచా. ప్రస్తుతం అతడు ఢిల్లీలో పని చేస్తున్నాడు. ఫ్యాషన్ మోడల్ గా పనిచేస్తున్న మున్ మున్ ధమేచాకు షారుఖ్ కొడుకు ఆర్యన్ తో రెండేళ్ల క్రితం పరిచయం అయ్యింది. అప్పటి నుంచి వీళ్లంతా పార్టీల్లో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Monarch Dhamecha (@munmundhamecha)