తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్ ప్యానల్, మంచు విష్ణు ప్యానల్ మధ్య పోటీ తీవ్ర స్థాయిలో నెలకొంది. ప్రకాశ్‌రాజ్‌కు మద్దతుగా మెగా ఫ్యామిలీ, శ్రీకాంత్ లాంటి హేమాహేమీలు ఉంటే, మంచు విష్ణు ప్యానల్‌లో అవుట్ డేటెడ్ య్యాక్టర్లు ఉన్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం మా అధ్యక్షుడిగా ఉన్న నరేష్ మినహా విష్ణుకు బడా వ్యక్తులు ఎవరూ మద్దతు తెలపలేదు. గతంలో నరేష్ కూడా మెగా ఫ్యామిలీ మద్దతుతోనే శివాజీరాజాపై విజయం సాధించారు. ఇప్పుడు ఆయన మెగా మద్దతు ఉన్న ప్రకాశ్‌రాజ్‌ను కాదని విష్ణుకు మద్దతు ఇస్తున్నారు.
విష్ణుకు ఓటు వేయాలని మోహన్‌బాబు ఒక సందర్భంలో ఇతర నటులను కోరారు. కానీ విష్ణు సోదరుడు మంచు మనోజ్ మాత్రం ఇప్పటి వరకు విష్ణుకు మద్దతు తెల్పలేదు. వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని గతంలో చాలా సార్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. కానీ వాటిపై ఇద్దరు సోదరులకు కూడా స్పందించలేదు. ఇప్పుడు మా ఎన్నికల్లో పోటీ చేస్తున్న మంచు విష్ణు గెలిచేందుకు గట్టిగానే పోరాడుతున్నారు. ఇలాంటి సమయంలో సొంత తమ్ముడు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించకపోవడం లేదా విష్ణుకు మద్దతు తెలపండి అని ఎవరినీ కోరకపోవడంతో ఇద్దరి మధ్య నిజంగానే విభేదాలు ఉన్నాయా? అనే అనుమానాలు మరోసారి వ్యక్తం అవుతున్నాయి. మంచు మనోజ్ సమాజంలో జరిగే అనేక విషయాలపై స్పందిస్తుంటారు. ఇటీవల సైదాబాద్ ఆరేళ్ల బాలిక హత్యాచారం ఘటనపై కూడా స్పందించి, బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు. ఇప్పుడు మా ఎన్నికలపై మాత్రం మౌనం వహిస్తున్నారు.
‘మా’ ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం మనోజ్‌కు ఇష్టం లేదని అందుకే ఆయన స్పందించడం లేదని ఆయన సన్నిహితులు చర్చించుకుంటున్నారు. లేదంటే కనీసం సోషల్ మీడియాలో అయిన విష్ణుకు మద్దతు తెలపండి అని గానీ, విష్ణు గెలవాలని కోరుకుంటున్నట్లు గానీ ఆయన పేర్కొనే వారని అనుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ విష్ణుకు సొంతింటి నుంచి సరైన మద్దతు లభించడం లేదనేది మాత్రం వాస్తవం. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: చిన్నారి అత్యాచార ఘటనపై మంచు మనోజ్ వీడియో సందేశం