మంచు మనోజ్-భూమా మౌనికల పెళ్లి గురించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. పెళ్లికి ముందు ఇద్దరూ చెన్నైలో సహజీవనం చేశారంట. ఈ విషయం స్వయంగా మంచు మనోజే చెప్పుకొచ్చారు.
మంచు మనోజ్- భూమా మౌనికల పెళ్లి టాలీవుడ్‌లో హాట్ టాపిక్ మారిన సంగతి తెలిసిందే. ఇద్దరికీ పెళ్లై నెల గడిచింది. ఈ నెల రోజుల్లో ఇద్దరి మధ్యా స్నేహం.. ప్రేమ, పెళ్లి గురించి రోజుకో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వస్తోంది. పెళ్లికి ముందు మనోజ్- మౌనికలు ఏడాదిన్నరపాటు చెన్నైలో సహజీవనం చేశారంట. ఈ విషయాన్ని మంచు మనోజే స్వయంగా చెప్పుకొచ్చారు. ప్రముఖ కమెడియన్ వెన్నెల కిశోర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షోలో ఈ విషయాలు వెల్లడించారు. భార్య మౌనికతో స్నేహం, వేరు వేరుగా పెళ్లిళ్లు, విడాకులు, ఇద్దరి పెళ్లి గురించి చెప్పారు. మంచు మనోజ్ టాక్ షోలో మాట్లాడుతూ..
‘‘ 15 ఏళ్లుగా రెండు కుటుంబాలకు స్నేహం ఉంది. ఇరు కుటుంబాల మంచి, చెడులకు తప్పకుండా హాజరయ్యేవాళ్లం. ఇద్దరం మరొకరితో ఏడు అడుగులు వేసి, వేరు వేరు మార్గాల్లోకి వెళ్లిపోయాం. డివర్స్ తర్వాత ఇద్దరం కలిసి ప్రయాణించాలని అనుకున్నాము. అప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. నా కోసం ఓ బిడ్డతో ఎదురుచూస్తున్న ఆమె కోసం సినిమాలను కూడా వదిలేసి వెళ్లాలని అనుకున్నాను. ఆ సమయంలో నేను చేస్తున్న ‘‘ అహం బ్రహ్మాస్మి’’ సినిమాను మధ్యలో వదిలేశాను. మౌనికను తీసుకుని చెన్నై వెళ్లిపోయాను.
చెన్నైలోనే ఓ సంవత్సరానికి పైగా సహజీవనం చేశాం. మేము చెన్నైలో కలిసి ఉన్న సంగతి ఎవ్వరికీ తెలీదు’’ అని అన్నారు. ప్రస్తుతం ఈ సహజీవనం విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, మంచు మనోజ్, భూమా మౌనికలు మార్చి 3న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ పెళ్లికి కుటుంబసభ్యులు అందరూ హజరయ్యారు. అయితే, తర్వాత మనోజ్, విష్ణులు గొడవ పడుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, మంచు మనోజ్- మౌనిక 15 ఏళ్ల స్నేహం, ప్రేమ, పెళ్లిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.