మా ఎన్నికలు.. ప్రకాష్ రాజ్ పై కోట శ్రీనివాస రావు కీలక వ్యాఖ్యలు

maa kota srinivas

తెలుగు చిత్ర పరిశ్రమలో మా ఎన్నికలు కాస్త రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రత్యక్ష రాజకీయ ఎన్నికలను మించిపోతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలపై ఎన్నడు లేనంతగా ఆసక్తి నెలకొంది. అయితే మా అధ్యక్ష రేసులో ఉన్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఒకరిపై ఒకరు మాటల దాడికి దిగుతు ఆరోపణలు, ప్రతీఆరోపణలకు చేసుకుంటున్నారు. అయితే ఇటీవల ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు మద్దతు పలికారు నాగబాబు. మా నుంచి ప్రకాష్ రాజ్ గెలుపుకు సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.

maa elections manchu vishnuకాగా మొదట్లో ప్రకాష్ రాజ్ కు మద్దతు ఉన్నా రోజు రోజుకు తగ్గిపోతుందని ఓ వర్గం నటులు తెలియజేస్తున్నారు. సీనియర్ నటీనటులు నాన్ లోకల్ అనే అంశంపై ప్రకాష్ రాజ్ కు విభేదిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రకాష్ రాజ్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు. నేను ప్రకాష్ రాజ్ తో 15 పైగా సినిమాల్లో నటించానని, ఏనాడు కూడా ఆయన సెట్ కు సమయానికి వచ్చింది లేదని తెలిపాడు. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు అర్హుడని ఈ ఎన్నికల్లో మంచు విష్ణుకి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఇక హోరాహోరిగా సాగుతున్న మా ఎన్నికల్లో ఎవరూ గెలుస్తారానని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.