రికార్డ్స్.. రికార్డ్స్.. రికార్డ్స్.. ప్రస్తుతం కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమాకి ఇది ఊతపదంగా మారిపోయింది. విడుదలైన రోజు నుంచి ఈ సినిమా రికార్డుల వేట కొనసాగిస్తూనే ఉంది. దేశంలో హైఎస్ట్ గ్రాస్ సాధించిన ఆరో చిత్రంగా కేజీఎఫ్ ఛాప్టర్ 2 రికార్డు సృష్టించింది. మొత్తం 11 రోజుల్లో ఈ సినిమా 883 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. కేజీఎఫ్ పార్ట్ 1 సినిమాకి రికార్డులు సాధించలేకపోయినా.. ఛాప్టర్ 2 సినిమాపై హైప్ ను పెంచేసింది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ దేశంలోని టాప్ డైరెక్టర్ల సరసన నిల్చోడానికి కారణం కూడా అదే.
ఇదీ చదవండి: హీరోయిన్ కంగనా షాకింగ్ కామెంట్స్! అతను నన్ను లైంగికంగా వేధించాడు!
ఈ సినిమాతో యశ్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు, పాన్ ఇండియా స్టార్ హోదా వచ్చింది. ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు లభిస్తూనే ఉంది. ఆ సినిమాలో చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ రుత్విక్ ను సుమన్ టీవీ పలకరించింది. ఆసినిమా సంగతులు మొత్తం గుర్తు చేసుకుంటూ.. అసలు యశ్ ఎలా ఉండేవాడు? ప్రశాంత్ నీల్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. మరి, ఈ కింది వీడియోలో ఆ స్పెషల్ ఇంటర్వ్యూ మీరూ చూసేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.