హీరోయిన్ కంగనా షాకింగ్ కామెంట్స్! అతను నన్ను లైంగికంగా వేధించాడు!

Kangana raunat reveals her personal life secrets

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. ‘లాకప్’ అనే రియాలిటీ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ మెల్లమెల్లగా తమ లైఫ్ లో ఎదుర్కొన్న కష్టాలు, బాధించిన విషయాలను షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా కంటెస్టెంట్ మునవర్ ఫారూఖీ.. 6 ఏళ్ల వయస్సులో లైంగిక వేధింపులకు గురైనట్లు చెప్పాడు. దగ్గరి బంధువులే త‌న‌ను లైంగికంగా వేధించేవారని, ఐదేళ్ల పాటు ఇలాంటి వేధింపుల‌ను భరించానని తెలిపాడు.

ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెబితే అర్థం చేసుకోలేరని భావించి చెప్పలేకపోయానని అన్నాడు. అనంతరం హోస్ట్ కంగ‌నా స్పందించి.. చిన్న‌ వయస్సులో త‌న‌కు కూడా ఇలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొన్నానని.. తన చిన్ననాటి చేదు సంఘటనలను గుర్తుచేసుకుంది. కంగనా మాట్లాడుతూ.. “కొందరు కామాంధులు సమాజంలో చిన్నారుల‌తో ఇలాగే అస‌భ్యంగా ప్రవర్తిస్తుంటారు. నాకు కూడా అలాంటి అనుభవం ఎదురైంది.

మా గ్రామంలో నాకంటే పెద్దవాడైన ఓ వ్యక్తి నన్ను ఉద్దేశ‌పూర్వ‌కంగా తాకుతూ ఉండేవాడు. ఆ వయసులో అతడి ఉద్దేశం ఏంటో నాకు అర్థం కాలేదు. నాలాంటి చిన్న వయస్సువారిని పిలిచి బట్టలు విప్పమని అడిగేవాడు. అనుచితంగా శరీరాన్ని తడుముతూ ఉండేవాడు. ఆ వ్యక్తి మాకంటే 4-5 ఏళ్ళు పెద్దవాడు. ఆ స‌మ‌యంలో మా వయస్సు 6 ఏళ్లు మాత్రమే, దీంతో అత‌డి చేష్ట‌ల‌ను మేము గుర్తించలేకపోయేవాళ్ళం” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కంగనా మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి కంగనా మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.