స్టార్ హీరోయిన్ దీపికా పడుకోణె ఆత్మహత్యాయత్నం.. ఏమైందంటే?

దీపికా పడుకోణె.. గత కొన్నేళ్లుగా బాలీవుడ్ ని ఏలుతున్న స్టార్ హీరోయిన్. ఇప్పటికీ దీపికా చేతిలో మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మరి.. అలాంటి స్టార్ హీరోయిన్ ఆత్మహత్యాయత్నం చేయడం ఏమిటి? అసలు ఏమైంది అని టెన్షన్ పడుతున్నారా? దీపికా ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచించిన మాట నిజమే. అయితే.. అది ఇప్పుడు కాదు 2014లో. ఇప్పుడు ఈ విషయాన్ని స్వయంగా ఆమే బయట పెట్టింది.

దీపికా పదుకొణె తాజాగా ‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’ టీవీ షోకి గెస్ట్ గా వచ్చింది. దీపికాతో పాటు ఫరాఖాన్‌ కూడా ఈ షోలో పాల్గొంది. ఈ నేపథ్యంలోనే అమితాబ్‌.. దీపిక డిప్రెషన్‌లోకి వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడు దీపిక తాను ఎదుర్కొన్న కష్ట సమయం గురించి వివరించింది.

At that time she wanted to die Deepika Padukune - Suman TV“నిజమే నేను ‘2014లో నేను డిప్రెషన్‌లోకి వెళ్ళాను.రోజూ లేవగానే విచిత్రంగా ఉండేది. ఉన్నట్టుండి ఏడ్చేసేదాన్ని. ఎవరితోనైనా మాట్లాడాలని గానీ.. బయటికి వెళ్లాలని గానీ అనిపించేంది కాదు. చాలా సందర్భాల్లో ఎందుకు బతకడం అనిపించేది. అప్పుడే చనిపోదామనుకున్నా కూడా. కానీ.., ఆ సమయంలో నన్ను ఆదుకుంది అమ్మ. ఆమె నా మానసిక పరిస్థితి బాగోలేదని గుర్తించి సైకియార్టిస్ట్‌ దగ్గరకు వెళ్లమని సలహా ఇచ్చింది. తరువాత కొన్ని నెలల్లోనే నేను డిప్రెషన్‌ నుంచి బయటపడ్డాను. అవి దారుణమైన రోజులు” అంటూ.. దీపికా ఎమోషనల్‌ అయింది.

ఆ సమయంలో దీపికా పదుకొణె ఇంత నరకం అనుభవించిందా అంటూ అభిమానులు బాధపడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.