సుమపై సిద్దార్ధ్ సంచలన కామెంట్స్.. కత్తిలా ఉంటావ్ అంటూ..!

Suma Siddharath

శర్వానంద్‌, సిద్ధార్థ్‌ జంటగా తెరకెక్కనున్న చిత్రం మహాసముద్రం. అజయ్‌ భూపతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అక్టోబరు 14న థియేటర్లలో రిలీజ్‌ కానుంది. హీరో శర్వానంద్‌కు మంచి హిట్‌ పడి చాలా రోజులు అయ్యింది. సిద్ధార్థ్‌ కూడా తెలుగు ప్రేక్షకులకు కనిపించి చాలా గ్యాప్‌ వచ్చింది. ఒరేయ్‌ బామ్మర్ది సినిమా తెలుగులో వచ్చినా.. పెద్దగా ఆదరణ లభించలేదు. ఇప్పుడు ఈ మల్టీస్టారర్‌ హిట్టయితే ఇద్దరికీ మంచి హిట్‌ పడినట్లే అవుతుంది. ఈ సినిమా యూనిట్‌ తాజాగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. చిత్రబృందం మొత్తం ఈ సినిమా విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. ఇద్దరు మిత్రులు అనుకోని కారణాల వల్ల శత్రువులుగా మారి.. చివరకు కలుస్తారా? లేదా అన్న అంశంతో కథ నడుస్తుంది. ట్రైలర్‌లో గన్నులు ఆయుధాలను చూస్తుంటే.. గ్యాంగ్‌ వార్‌లు కూడా ఉండేలా అనిపిస్తోంది. అదే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మరో ఆసక్తికర ఘటన ఒకటి చోటుచేసుకుంది.

ఇదీ చదవండి: మంచు విష్ణు విజయం వెనుకున్న  10 కారణాలు

ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ హోస్ట్‌గా ఉన్న సుమ ఇద్దరు హీరోలకు ఒక టాస్కు ఇచ్చింది. ఆ టాస్కు ఏంటంటే ఇద్దరు హీరోలకు ఒకరి గురించి ఒకరికి ఎంత తెలుసు? అన్నదే అంశం. అలా ప్రశ్నలు అడుగుతూ వెళ్తోంది సుమ. మధ్యలో హీరో సిద్ధార్థ్‌ని.. శర్వానంద్‌ నటించిన ‘శతమానం భవతి సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు ఎవరు యాంకర్‌గా చేశారు?’ అని ప్రశ్నించింది.  ఆ ప్రశ్నకు సిద్ధార్థ్‌ ‘ఆ ప్రశ్నకు సమాధానం నాకు తెలుసు.. యాక్చువల్‌గా చాలా కాలం ముందు కత్తిలాంటి ఫిగర్‌. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా.. ఏముందిరా అమ్మాయి ఒక్కసారి అయినా ఒక ఫంక్షన్‌కి యాంకర్‌గా చేయించాలని అనుకున్నా. శతమానం భవతి యాంకర్‌ సుమగారు కదా అని సమాధానమిచ్చాడు. సిద్ధార్థ్‌ సమాధానం చెప్పడం మొదలు పెట్టే సమయం నుంచే సుమ ఫుల్‌ షాక్‌లో ఉంది. ‘ఇప్పటి వరకు నాకు కూడా తెలీదు నేను కత్తిలాంటి ఫిగర్‌ని అని’ అంటూ నవ్వుకుంటుంది సుమ. ఇప్పుడు ఈ వీడియో నెట్టింటి వైరలవుతోంది.