ప్రేమ కథా చిత్రాలతో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకుని.. తెలుగు, తమిళంలో స్టార్‌గా మారిన సిద్ధు గతకొంత కాలంగా ప్రేక్షకాభిమానులను నిరాశ పరుస్తున్నాడు. దీంతో యాక్షన్ హీరో అవతారమెత్తి ఇటీవల ‘టక్కర్’ చేశాడు.
థియేటర్లలో వారాంతంలో ఎక్కువగా సినిమాలు విడుదలవుతుంటాయి. అదే ఓటీటీల్లో మాత్రం ప్రతి రోజూ కొత్త చిత్రాలు, సిరీస్‌లు రిలీజ్ అవుతుంటాయి. హాలీవుడ్ మొదలుకుని ఇతర భాషలకు చెందిన మూవీస్, సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా సిద్దార్థ్ నటించిన రీసెంట్ ఫిలిం ‘టక్కర్’ ఓటీటీలోకి వచ్చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రేమ కథా చిత్రాలతో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకుని.. తెలుగు, తమిళంలో స్టార్‌గా మారిన సిద్ధు గతకొంత కాలంగా ప్రేక్షకాభిమానులను నిరాశ పరుస్తున్నాడు. రొటీన్ సినిమాలు చేస్తుండడంతో వరుసగా ఫ్లాప్స్ పడుతున్నాయి. దీంతో యాక్షన్ హీరో అవతారమెత్తి ఇటీవల ‘టక్కర్’ చేశాడు. ‘మజిలీ’ ఫేమ్ దివ్యాంశ కౌషిక్ కథానాయిక. కార్తీక్ డైరెక్టర్.
విడుదలకు ముందు టీజర్, ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచాయి కానీ థియేటర్లలోకి వచ్చాక మాత్రం నిరాశ పరిచింది. ఆల్రెడీ ఇలాంటి కథలు జనాలు చూసేశారు. దీంతో సిద్ధు ఖాతాలో మరో ఫ్లాప్ వచ్చి చేరింది. ఇప్పుడు ‘టక్కర్’ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో పాపులర్ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చెయ్యనున్నట్లు ప్రకటించారు. జూలై 7 శుక్రవారం నుండి తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
సిద్దార్థ్ క్రేజ్ కారణంగా తెలుగులో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ రిలీజ్ చేశారు. కట్ చేస్తే రిజల్ట్ తేడా కొట్టింది. అయితే ఇటీవల కాలంలో థియేటర్లలో అంతగా ఆడని సినిమాలు కొన్ని ఓటీటీల్లో హిట్ అవుతున్నాయి. మరి ‘టక్కర్’ ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి. దీంతో పాటు మరి కొన్ని మూవీస్. వెబ్ సిరీస్‌లు ఈ వారంలో ఓటీటీలో సందడి చెయ్యడానికి రెడీ అవుతున్నాయి.
Siddharth’s #Takkar will be streaming from this July 7 in NETFLIX. pic.twitter.com/uFSc1NASlb
— Christopher Kanagaraj (@Chrissuccess) July 5, 2023