మా ఎన్నికల్లో రసాభాస.. ఫన్నీగా శివ బాలాజీ చెయి కొరికిన హేమ

Maa Elections SivaBalaji

గత రెండు మూడు నెలల నుంచి రసవత్తరంగా సాగుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేష్ ఎన్నికల ఓటింగ్ నేడు కాస్త ఆసక్తిగా చిత్ర విచిత్రల నడుమ సాగుతోంది. జూబ్లిహిల్స్ లోని ఎన్నికల కేంద్రానికి చేరుకున్న నటీనటులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఓటింగ్ లో భాగంగా బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

అయితే ఈ ఎన్నికల ఓటింగ్ లో మాత్రం ఎన్నడు లేనంతగా ఎంతో ఆసక్తి తో కూడిన చిత్ర విచిత్రాలు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నటి హేమ శివబాలాజి చెయి కోరికిందంటూ ప్రకాష్ రాజ్ సభ్యులు కాసేపు వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో సభ్యులు ఒకరిమీద ఒకరు అరోపణలు, ప్రతీఆరోపణలకు దిగారు. దీంతో స్పందించిన హేమ నేను ఏం కారణం లేకుండా ఎలా కోరుకుతాను అంటూ మీడియాకు తెలిపింది. ఓ యువకుడిపై దాడికి చేస్తుంటే కాపాడేందుకు వెళ్తే.. శివబాలాజి నన్ను అడ్డుకున్నాడని, అందుకే అలా కొరికానంటూ హేమ వివరణ ఇచ్చింది. ఇలా ఎన్నో ఫన్నీ సీన్ ల మధ్య మా ఎన్నికల ఓటింగ్ కాస్త హీట్ పుట్టిస్తుంది.