తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ గురించి తెలియని వారుండరు. తెలుగు సినిమాల్లో అక్క, అమ్మ, చెల్లెలు, వదిన వంటి పాత్రల్లో ఎక్కువగా కనిపిస్తుంటారు. ఆమె సినిమాల వల్ల ఎంత పాపులారిటీ తెచ్చుకున్నారో.. మా ఎలక్షన్స్ వల్ల అదే స్థాయిలో పాపులారిటీ తెచ్చుకున్నారు. అసలు విషయంలోకి వస్తే.. ఆమె ఇవాళ ఉదయం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతున్నప్పుడు రిపోర్టర్ వేసిన ఒక ప్రశ్నకు సహనం కోల్పోయిన ఆమె సీరియస్ అయ్యారు. ఆ వివరాలు..
నటి హేమ ప్రతి ఏడాదిలాగే.. ఈ ఏడాది కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మొదట అమ్మవారిని చూడలేనేమో అనుకున్నప్పటికీ.. అమ్మవారే ఇక్కడకి రప్పించారని తెలిపారు. కొండంత ధైర్యం ఇవ్వమని అమ్మవారిని కోరుకున్నానని అన్నారు. ఈ క్రమంలో ఒక రిపోర్టర్ టికెట్స్ తీసుకున్నారా లేదా అని ప్రశ్నించగా.. సహనం కోల్పోయిన ఆమె అతనిపై సీరియస్ అయ్యారు. ” మేము ఇద్దరం వచ్చాము.. హుండీలో పది వేలు వేశాను. అమ్మవారికి 20 వేలు పెట్టి చీర తెచ్చాను. మీరు టికెట్ గురుంచి మాట్లాడుతున్నారు. ప్రోటోకాల్ ప్రకారమే ఫాలో అవుతున్నాం. దీన్ని కాంట్రవర్సీ చేయడం సరికాదంటూ..” అక్కడి నుంచి వెళ్లిపోయారు.