Kidney Failure: నటి అనన్య సోనీ జీవితాన్ని విషాదం నీడలా వెంటాడుతోంది. కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆమె పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ప్రస్తుతం ఆమె చావు బతుకుల మధ్య ప్రాణాల కోసం పోరాడుతోంది. డయాలసిస్‌తో రోజులు గడుపుతోంది. 2015లో ఆమె రెండు కిడ్నీలు పాడయ్యాయి. దీంతో ఆమె తండ్రి ఓ కిడ్నీ దానం చేశాడు. ఆపరేషన్ తర్వాతినుంచి ఆమె ఒక కిడ్నీతోనే బతుకుతోంది. తాజాగా, కొత్తగా వేసిన కిడ్నీ కూడా పాడైంది. సోమవారం ఆమె ఆసుపత్రిలో చేరాల్సింది ఉంది. ఈ నేపథ్యంలో నిన్న ‘‘మేరే సాయి’’ షూటింగ్‌లో పాల్గొంది.
షూటింగ్ మధ్యలో ఉండగానే ఆమె అస్వస్థతకు గురై కుప్పకూలింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అనంతరం సోనీ తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ నా కూతురు రెండు కిడ్నీలు పాడయ్యాయని డాక్టర్లు చెప్పారు. వాటిని మార్చాలంట. ప్రస్తుతం ఆమె డయాలసిస్ మీద ఉంది. ఇప్పుడు ఆపరేషన్‌కోసం, కిడ్నీ కోసం డబ్బులు అవసరమవుతాయి. అంత డబ్బులు ఖర్చుపెట్టే పరిస్థితిలో మేము లేము’’ అని తెలిపాడు. గతంలో తన కిడ్నీల పాడవటంపై అనన్య మాట్లాడుతూ.. ‘‘ 2015నుంచి నేను ఒక కిడ్నీతో బతుకుతున్నాను.
నా రెండు కిడ్నీలు 6 సంవత్సరాల క్రితమే పాడయ్యాయి. అప్పుడు మా నాన్న ఓ కిడ్నీ ఇచ్చారు. ఉన్నట్టుండి ఆ కిడ్నీ కూడా సరిగా పనిచేయటం లేదు. ఇప్పుడు నాకు కొత్తగా మరో కిడ్నీ కావాలి. నేను ఇలాంటి ఓ పరిస్థితి వస్తుందని నా కలలో కూడా అనుకోలేదు. మా అమ్మకు బట్టల వ్యాపారం ఉండింది. మా అన్న కూడా బాగానే సంపాదించేవాడు. మా ఇళ్లు అగ్ని ప్రమాదానికి గురైనపుడు మా అమ్మ బిజినెస్ పాడైంది. అంతా నాశనం అయిపోయింది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, అనన్య ప్రస్తుతం మేరే సాయి, నామ్ కరణ్, క్రైమ్ పాట్రోల్ వంటి సీరియల్స్‌లో నటిస్తోంది.