టాలీవుడ్ లో మాస్ కాంబినేషన్స్ చాలానే ఉన్నాయి. ఆ జాబితాలో నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబో ఒకటి. తెరమీదకు వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే చాలు.. నందమూరి ఫ్యాన్స్ లో, ప్రేక్షకులలో కనిపించే ఉత్సాహం పీక్స్ కి చేరుకుంటుంది. ఇక సినిమా థియేట్రికల్ రిలీజ్ అయ్యిందంటే చాలు.. థియేటర్లలో వద్ద మాస్ జాతరే జరుగుతుంది. ఊహించని కలెక్షన్స్ కూడా నమోదు అవుతాయి. అంటే.. ఈ కాంబినేషన్ కి అంత పవర్ ఉంది. ఇప్పటికే మూడు తిరుగులేని బ్లాక్ బస్టర్స్ ఖాతాలో వేసుకున్న బాలకృష్ణ, బోయపాటి కాంబోలో మరో సినిమాకు రంగం సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ మాస్ కాంబోలో వచ్చిన మూడు సినిమాలు వారి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. అటు బోయపాటికి మాస్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు లభించింది. అయితే.. బాలయ్యతో బోయపాటి సినిమాలు మరిన్ని రావాలనేది ఫ్యాన్స్ ఎప్పటినుండో కోరుకుంటున్నారు. ఎందుకంటే.. మాస్ పల్స్ తెలిసిన బోయపాటి, మాస్ ఫ్యాన్ బేస్ కలిగిన బాలయ్య.. వీరిద్దరూ సింహా, లెజెండ్, అఖండ సినిమాలతో బాక్సాఫీస్ ని షేక్ చేసేశారు. ఇంకా నాలుగోసారి జతకట్టబోతున్నారంటే.. అది ఏ స్థాయిలో ఉండబోతుందో ఫ్యాన్స్ అంచనా వేయలేరనే చెప్పాలి. ఈ క్రమంలో వీరి కాంబినేషన్ లో నాలుగో సినిమా రాబోతుందని టాక్ బలంగా వినిపిస్తోందని రూమర్స్ వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం బాలయ్య డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. మరోవైపు బోయపాటి.. హీరో రామ్ తో పాన్ ఇండియా సినిమా చేయనున్నాడు. వీరిద్దరూ కూడా ఇప్పుడు కమిట్ అయిన సినిమాల తర్వాత మళ్లీ సినిమా చేస్తారని, అదికూడా పొలిటికల్ యాక్షన్ మూవీ అని సినీవర్గాలలో బలమైన టాక్ నడుస్తోంది. మరి ఈ క్రేజీ కాంబినేషన్ లో నాలుగో సినిమా ఉంటుందా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉండగా.. వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చూడాలి మరి బాలయ్య – బోయపాటి మాస్ ఫీస్ట్ మరోసారి రిపీట్ అవుతుందేమో!
Rampage At Boxoffice #MassJathara 🔥🔥🔥#RoaringBlockBusterAKHANDA pic.twitter.com/BITCP99sge
— Bangalore Nandamuri Fans (@BloreNandamuriF) December 3, 2021