జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న మేల్ కమెడియన్స్ తో పాటు లేడీ కమెడియన్స్ కూడా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా లేడీ గెటప్స్ తర్వాత లేడీ కమెడియన్స్ వెలుగులోకి రావడం మొదలైంది. జబర్దస్త్ వేదికపై లేడీ కమెడియన్ గా పేరొందిన వారిలో పవిత్ర ఒకరు. సోషల్ మీడియాలో పాగల్ పవిత్రగా ఈమె ఫేమస్. అయితే.. జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్ లతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఫెస్టివల్ స్పెషల్ ఈవెంట్స్ లాంటి ప్రోగ్రామ్స్ లో పవిత్ర రెగ్యులర్ గా కనిపిస్తుంది. అలాగే యూట్యూబ్ లో కూడా పాగల్ పవిత్ర అనే పేరుతో సొంతంగా యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తోంది.
ఇక సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన పవిత్ర.. తాజాగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పి సర్ప్రైజ్ చేసింది. ఇంతకాలం కామెడీ స్కిట్స్ లో అలరిస్తూ వచ్చిన పవిత్ర.. ఇప్పుడు ఏకంగా కొత్త కారు కొన్న వార్తను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. అలాగే యూట్యూబ్ తాను కారు కొన్న వీడియోను వ్లాగ్ రూపంలో రిలీజ్ చేసింది. అయితే.. తనతో ఎప్పుడు తోడుగా కనిపించే జబర్దస్త్ రోహిణిని తోడుగా తీసుకెళ్లి పవిత్ర కారు కొనుక్కుంది. హ్యుందాయ్ ఐ20 మోడల్ కారును కొన్న పవిత్ర.. తన తల్లికి వీడియో కాల్ ద్వారా విషయాన్నీ చెప్పేసింది. ప్రస్తుతం పాగల్ పవిత్ర కొత్త కారు కొనుగోలు చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక సోషల్ మీడియాలో పవిత్ర ఫ్యాన్స్ అంతా ఆమెకు విషెస్ చెబుతున్నారు.