పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తున్న ఈ తరుణంలో స్టార్ హీరోలకు సంబంధించి ఎలాంటి కొత్త అప్ డేట్ వినిపించినా ఫ్యాన్స్ లో కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. అందులోను పాన్ ఇండియా సినిమాల అప్ డేట్ అయితే అంతే. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతున్న మూవీ గురించి క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. కొరటాల శివతో సినిమా చేశాక ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికారికంగా అనౌన్స్ చేసిన ఈ సినిమాను మైత్రి మూవీస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమా షూటింగ్ మొదలుకానుంది.
తాజా సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్ తో భారీ పాన్ ఇండియా మూవీ రూపొందించే ప్లాన్ లో ఉన్నాడు ప్రశాంత్ నీల్. ఇప్పటికే ఎన్టీఆర్ పుట్టినరోజున ఓ మాస్ లుక్ పోస్టర్ వదిలి అంచనాలు పెంచేశాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాలో కీలక రోల్ కోసం స్టార్ హీరోని ఒప్పించే పనిలో పడ్డాడట ప్రశాంత్. కోలీవుడ్ స్టార్ విక్రమ్ ని ఎన్టీఆర్ సినిమాలోకి తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తుంది. సినిమాలో కీలక రోల్ అంటే.. హీరో తర్వాత అంతటి స్కోప్ ఉన్న రోల్ కోసం విక్రమ్ ని ప్రశాంత్ టీమ్ సంప్రదించిందని, ప్రశాంత్ వెర్షన్ విన్నాక విక్రమ్ కూడా ఈ సినిమా కోసం సానుకూలంగా స్పందించాడని సినీవర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉండగా.. ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. దీంతో తదుపరి సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు కొరటాల శివతో 30వ సినిమా చేసిన తర్వాత ప్రశాంత్ నీల్ తో తన 31వ సినిమా చేయనున్నాడు. మరోవైపు ప్రశాంత్ నీల్ డార్లింగ్ ప్రభాస్ తో ‘సలార్’ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సలార్ మూవీ.. వచ్చే ఏడాది సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఇక సలార్ సినిమాను కేజీఎఫ్ ఫేమ్ హోంబలే ఫిలిమ్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. చూడాలి మరి ఎన్టీఆర్ సినిమాలో విలక్షణ నటుడు విక్రమ్ నటిస్తాడో లేదో!
😳😳😳😳💥💥💥💥💥💥🔥🔥🔥🔥🔥🌋🌋🌋🌋🌋❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥🤩🤩🤩🤩🤩🤩🤩🤩
IF THIS HAPPENS TRUE 🤩❤️🔥🌋🔥💥❤️🔥🌋🔥🔥❤️🔥❤️🔥🤩❤️🔥🌋🔥🌋🔥❤️🔥🌋🔥🔥 @tarak9999 @prashanth_neel #NTR𓃵 #NTRGoesGlobal #NTR #JrNTR pic.twitter.com/Z9PZdIQPsM— Surya Sujith (@_ntrfansujith_) September 26, 2022
#NTR #NTR30 #NTR31#ManOfMassesNTR
Jai NTR 💥 pic.twitter.com/wC5GLj4N6Z— NTR DBOSS (@DbossNtrKA) October 2, 2022