హీరోయిన్ నయనతారకు అరుదైన గౌరవం..

nayanthara poster

దక్షిణాది తార నయనతారకు అరుదైన గౌరవం దక్కింది. సాధారణంగా ఫోర్బ్స్‌ అనగానే వ్యాపారవేత్తలు, మహా అయితే ఆటగాళ్ల ఫొటోలు కవర్‌ పేజీలో వస్తుంటాయి. సినిమా తారలు అంటే చాలా తక్కువ. వచ్చినా బాలీవుడ్‌ తారలే వస్తుంటారని అనుకుంటారు. కానీ, ఈసారి నయనతార ఆ అదృష్టాన్ని సొంతం చేసుకుంది. ఫోర్బ్స్‌ కవర్‌ పేజీపై నయనతార స్థానం దక్కించుకుంది.

ఇదీ చదవండి: ‘చూపే బంగారామాయనే శ్రీవల్లి’.. పుష్ప లిరికల్‌ సాంగ్‌ అదుర్స్‌!

కొవిడ్‌ విపత్కర పరిస్థితుల దృష్ట్యా సినిమా ఇండస్ట్రీ అతలాకుతలమైంది. థియేటర్లు మూతపడ్డాయి. ఆ సమయంలో ఓటీటీలు ఊపందుకున్నాయి. భారీ బడ్జెట్‌ కాకపోయినా ఒక మోస్తరు సినిమాలు ఓటీటీల దారి పట్టాయి. పెద్ద తారలు సైతం వెబ్‌ సిరీస్‌లలో నటించడం మొదలు పెట్టారు. అదే అవకాశాన్ని నయనతార అందిపుచ్చుకుంది. తెలుగు, తమిలం, మలయాళంలో దూసుకుపోతోంది. అందుకే ఫోర్బ్స్‌ ఆమెను ఎంపిక చేసింది. మొత్తం ముగ్గురిని ఎంపిక చేయగా. వారిలో నయనతారనే ముందంజలో నిలిచింది. నయనతార కాకుండా దుల్కర్‌ సల్మాన్‌, యష్‌లనూ ఫోర్బ్స్‌ ఎంపిక చేసింది.