‘చూపే బంగారామాయనే శ్రీవల్లి’.. పుష్ప లిరికల్‌ సాంగ్‌ అదుర్స్‌!

Srivalli Song Review

ఐకానిక్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్‌ ‘పుష్ప’ ఇది రెండు పార్టులుగా వస్తున్న విషయం తెలిసిందే. మొదటి పార్టు నుంచి ఇప్పటికే బన్నీ, రష్మిక లుక్స్‌, దాక్కో దాక్కో మేక సాంగ్‌ రిలీజ్‌ అయ్యి రికార్డులు బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా శ్రీవల్లి లిరికల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం.

ఈ పాటకు డీఎస్పీ సంగీతం, సిడ్‌ శ్రీరామ్‌ పాటను ఆలపించాడు. రష్మిక పాల వ్యాపారం చేసే మహిళగా ఉంటుంది. పాటలో చూస్తుంటే బన్నీ.. రష్మిక ప్రేమ కోసం ఆమె వెంట పడుతుంటాడు. కానీ, అల్లు అర్జున్‌ చేసే పనుల కారణంగా రష్మిక అతడ్ని దూరం పెడుతున్నట్లు తెలుస్తోంది. లిరిక్స్‌ పరంగా గమనిస్తే మంచి లవ్‌స్టోరీ అని తెలుస్తోంది. పాటలో బన్నీ లుక్స్‌ కూడా చాలా డిఫరెంట్‌ మేనరిజంతో ఉన్నాయి. వీళ్ల మధ్యున్న లవ్‌స్టోరీ తెలియాలంటే సినిమా రిలీజ్‌ అయ్యేదాకా ఆగాల్సిందే. మరి ఆ సాంగ్‌ మీరూ చూసేయండి.