మన దేశంలో రాజకీయాలకు, సినిమాలకు మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. సినిమాల్లో రాణించిన అనేక మంది.. రాజకీయాల్లో ప్రవేశించి.. ఏకంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వారు కూడా ఉన్నారు. ఇప్పటికి చాలా మంది నటీనటులు రాజకీయాల్లో రాణిస్తున్నారు. సినీ నటులు రాజకీయాల్లోకి రావడం అన్నది నార్త్‌తో పోలిస్తే.. దక్షిణాదిలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఎన్టీఆర్, జయలలిత, కరుణానిధి మొదలు మొదలు.. నేడు రోజా, ఉదయనిధి స్టాలిన్ వరకు ఎందరో రాజకీయాల్లో రాణిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం వరకు త్రిష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుంది అంటూ జోరుగా ప్రచారం సాగింది. కానీ అవన్ని పుకార్లే అని తర్వాత తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా లేడీ సూపర్ స్టార్ నయనతారకు సంబంధించి ఓ వార్త తెగ వైరలవుతోంది. నయన్‌కు ఎంపీ సీటు ఇవ్వాలంటూ ఆమె అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఆ వివరాలు..
నూతన ఏడాది సందర్భంగా నయనతార.. భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి.. చెన్నై రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న నిరుపేద పిల్లలకు బహుమతుల ఇచ్చి.. వారిని ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలయ్యింది. ఇది చూసిన నయన్ అభిమానులు ఆమె ప్రశంసలు కురిపించడమే కాక.. ఆమెకు ఎంపీ సీటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నయన తార మనసు చాలా మంచిదని, ఇలాంటి సేవా గుణం ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలి అంటూ నయన్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే ఆమె రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. మరికొందరు కనీసం రాజ్య సభ సీటు ఇచ్చైనా ఆమె సేవలను మరింత మందికి చేరువ చేయాలని కోరుతున్నారు.
కానీ కొందరు మాత్రం.. ఏంటి ఒక్క వీడియోకే ఏకంగా ఎంపీ సీటు ఇవ్వాలా.. ఇంకో రెండు మూడు సార్లు ఇలానే హెల్ప్ చేస్తే.. ఏకంగా సీఎం సీటు ఇవ్వమంటారేమో కదా.. నయనతార కన్నా మంచి పనులు చేసే వాళ్లు.. సమాజంలో చాలా మంది ఉన్నారు.. వారికి ఎలా సాయం చేయాలో ఆలోచించండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజనులు. మరి నయన్ ఫ్యాన్స్ డిమాండ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Nayanthara vignesh shivan distributes gifts to road side peoples@VigneshShivN #NewYear2023 pic.twitter.com/DoPRog2jad
— Nandini Gopalakrishnan (@Nandhini_Twits) January 3, 2023