లేడీ సూపర్ స్టార్ అనగానే గుర్తొచ్చే వ్యక్తి నయనతార. హీరోయిన్ గా స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. గతంలో ఓ హీరోయిన్ తో ఇన్ డైరెక్ట్ గా గొడవ పెట్టుకుందట. ఈ విషయాన్ని ఆ హీరోయిన్ చాలారోజుల తర్వాత బయటపెట్టింది.
సినిమా ఇండస్ట్రీలో ఉన్నన్ని రోజులు ఏ హీరోయిన్ కూడా వివాదాల్లోకి వెళ్లాలని కోరుకోదు. ఎందుకంటే ఎవరిమీదైనా విమర్శలు చేస్తే తమ కెరీర్ లో ముందుకు వెళ్లలేరనే విషయం వీరికి తెలుసు. అందుకే ముద్దుగుమ్మలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కాస్త సర్దుకొని వెళ్తుంటారు. కానీ ఒక్కసారి ఇండస్ట్రీకి దూరమైతే మాత్రం వారికి ఎదురైన చేదు అనుభవాలు గురించి దైర్యంగా బయటపెడుతూ ఉంటారు. ‘యమదొంగ’ ఫేమ్ హీరోయిన్ మమతా మోహన్ దాస్ ఒక సినిమా పాట విషయంలో తన అసంతృప్తి తెలియజేసింది. అప్పట్లో అసలేం జరిగింది? ఈమెతో నయనతార నిజంగా గొడవపడిందా లాంటి విషయాల్ని బయటపెట్టింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘రాఖీ రాఖీ’ సాంగ్ తో సింగర్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మమతా మోహన్ దాస్, రాజమౌళి ‘యమదొంగ’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి మంచి మార్కులే కొట్టేసింది. ఆ తర్వాత చిన్న సినిమాల్లో లీడ్ రోల్స్, పెద్ద సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటిస్తూ తన కెరీర్ ని బాగానే ప్లాన్ చేసుకుంది. కేవలం నటిగానే కాదు ప్రత్యేక గీతాల్లో కూడా కనిపించి సందడి చేసింది. అయితే ఓసారి తాను ఒక స్టార్ హీరోయిన్ విషయంలో బాధపడినట్లు చెప్పుకొచ్చింది.
“రజినీకాంత్ నటించిన ఓ సినిమాలో నాకు ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాలోని ఒక పాటకోసం నన్ను సంప్రదించారు. నేను 4 రోజులు షూట్ లోనూ పాల్గొన్నాను. కానీ ఫైనల్ కాపీ వచ్చాక నా షాట్స్ అసలు అందులో ఏమి లేవు. కేవలం ఒకే ఒక్క షాట్ లో వెనుకనుంచి కనిపిస్తాను. ఈ పాట నాకు చెప్పినట్లు తీయలేదు. దానికి ఈ సినిమాలోని హీరోయినే కారణమని.. వేరే వారు చెబితే నాకు అర్ధమైంది. మరో హీరోయిన్ ఉందని ఆమెకు ముందే చెప్పలేదని.. అందుకే నేను ఉంటే షూటింగ్ కి రానని ఆమె చెప్పింది. అందుకే నా పార్ట్ చాలావరకు సైడ్ చేశారు. ఈ పాత్ర కోసం 4 రోజులు కేటాయించినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది” అని మమతా మోహన్ దాస్ తన బాధని బయటపెట్టింది. ఇదిలా ఉండగా మమతా చేసిన కామెంట్స్ నయనతార గురించి, ‘కథానాయకుడు’ మూవీ గురించేనని తెలుస్తోంది. ఈమె చెప్పిన దాని ప్రకారం నయనతార మమత విషయంలో హర్ట్ అయి చిత్రబృందంతో గొడవపెట్టుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయమై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.