మా ఎన్నికల నుంచి తప్పుకున్న సీవీఎల్ నరసింహారావు

cvl narasimha rao

మా అధ్యక్ష పదవికి వేసిన నామినేషన్‌ను సీపీఎల్‌ నరసింహారావు ఉపసంహరించుకున్నారు. ‘నేను మా ఎన్నికల్లో ప్రెసిడెంట్ పదవికి నామినేషన్ వేశాను. ఇప్పుడు నామినేషన్‌ని ఉపసంహరించుకున్నాను. ఉదయమే నా మేనిఫెస్టోను ప్రకటించాను. నేను నామినేషన్ ఉపసంహరించడానికి ప్రత్యేక కారణం ఉంది. అన్ని వివరాలు రెండు రోజుల్లో మీడియా వారికి చెబుతాను. అధ్యక్ష పదవి కంటే నాకు మా సభ్యుల సంక్షేమం ముఖ్యం. ఇప్పుడు పోటీలో ఉన్న రెండు ప్యానెల్స్‌లో ఎవ్వరికీ నేను మద్దతు ఇవ్వటం లేదు. విజయశాంతి ట్విట్టర్ ద్వారా సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు. మా ఎన్నికల్లో ఎవరు గెలిచినా మా సంక్షేమం కోసం పని చెయ్యాలి’ అంటూ సీవీఎల్ సూచించారు. తాను తప్పుకోవడం వెనకున్న కారణాలను రెండ్రోజుల్లో చెబుతానన్నారు.